ఆ మ్యాజిక్ ఫిగర్ కొట్టినోడే టీమిండియా తర్వాతి కెప్టెన్... గంగూలీ, ఎమ్మెస్ ధోనీ, కోహ్లీ తర్వాత...

First Published Jul 8, 2022, 11:15 AM IST

సౌరవ్ గంగూలీ, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీల మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఈ ముగ్గురూ టీమిండియాకి సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా వ్యవహరించడమే కాదు, అప్పటిదాకా ఉన్న కెప్టెన్ల కంటే ఎక్కువ విజయాలు అందుకున్నారు... దాదా విజయాలను ధోనీ, మాహీ రికార్డును విరాట్ అధిగమించారు. యాదృచ్ఛికంగా ఈ ముగ్గురికి ఓ నెంబర్‌తో సెపరేట్ కనెక్షన్ ఉంది...

మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఎదుర్కొని, భారత జట్టు ప్రదర్శన అథఃపాతాళానికి పడిపోతున్న సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు సౌరవ్ గంగూలీ... భారత జట్టును యంగ్ ప్లేయర్లతో పునఃనిర్మించి, టాప్ టీమ్‌గా మలిచాడు..

2007 వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌ చేతుల్లో ఘోర పరాభవం తర్వాత టీమిండియా సారథిగా బాధ్యతలు అందుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ.. కెప్టెన్‌గా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ నెగ్గి... మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు...

Latest Videos


విదేశాల్లో వరుస పరాజయాలు అందుకుని టెస్టు ర్యాంకింగ్స్‌లో 7వ స్థానానికి పడిపోయిన సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. వరుసగా ఆరేళ్ల పాటు టీమిండియాని టెస్టు ఛాంపియన్‌గా నిలిపి, అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న సారథిగా టాప్‌లో నిలిచాడు...

అయితే భారత మాజీ కెప్టెన్‌లు సౌరవ్ గంగూలీ, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ... ఈ ముగ్గురికీ వన్డేల్లో అత్యధిక స్కోరు 183 పరుగులే కావడం విశేషం. 1999 వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 158 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 183 పరుగులు చేశాడు సౌరవ్ గంగూలీ... వన్డేల్లో గంగూలీకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన...

2005లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో 183 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఎమ్మెస్ ధోనీకి వన్డేల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు...

2012 ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 148 బంతుల్లో 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 183 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. విరాట్‌కి వన్డేల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతకుముందు సౌరవ్ గంగూలీ తొలుత బ్యాటింగ్ చేసిన సమయంలో 183 కొడితే, ఎమ్మెస్ ధోనీ, ‘ఛేజ్ మాస్టర్’ విరాట్ మాత్రం లక్ష్యఛేదనలో ఈ స్కోరు చేయడం విశేషం...

మరో విశేషం ఏంటంటే... సౌరవ్ గంగూలీ, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ ముగ్గురూ కూడా వేరే వాళ్ల కెప్టెన్సీలో ఆడిన మ్యాచుల్లోనే ఈ స్కోరు నమోదు చేశారు. మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో సౌరవ్ గంగూలీ 183 కొడితే, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ ధోనీ ఈ ఫీట్ సాధించాడు. మాహీ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ 183 చేశాడు...

Image credit: Getty

సౌరవ్ గంగూలీ తర్వాత రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే వంటి ప్లేయర్లు కెప్టెన్సీ చేసినా సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా కొనసాగలేకపోయారు. అలాగే విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ దక్కించుకున్నా అతను ఎంతోకాలం క్రికెట్‌లో కొనసాగే అవకాశం లేదు...

దీంతో సౌరవ్ గంగూలీ, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీల తర్వాత వన్డేల్లో ఈ 183 ఫిగర్ కొట్టే ప్లేయరే... టీమిండియా తర్వాతి కెప్టెన్‌గా సుదీర్ఘ కాలం కొనసాగుతాడని భావిస్తున్నారు కొందరు నెటిజన్లు. 183 కొట్టిన ప్లేయర్‌కే కెప్టెన్సీ అప్పగించాలని డిమాండ్లు కూడా చేస్తున్నారు...

click me!