Hardik Pandya: కెరీర్‌లో బెస్ట్ ర్యాంక్‌కు హార్ధిక్.. పాక్‌తో మ్యాచ్ తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జోరు

Published : Aug 31, 2022, 06:20 PM IST

ICC Rankings: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. బ్యాట్ తోనే గాక బంతితో కూడా అద్భుతాలు చేస్తున్న హార్ధిక్.. తాజాగా ఐసీసీ  ర్యాంకింగ్స్ లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ కు చేరాడు. 

PREV
16
Hardik Pandya: కెరీర్‌లో బెస్ట్ ర్యాంక్‌కు హార్ధిక్.. పాక్‌తో మ్యాచ్ తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జోరు
Image credit: PTI

గాయం కారణంగా ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయిన  టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా రీఎంట్రీలో మాత్రం అదరగొడుతున్నాడు.  రెండు నెలల క్రితం ఐపీఎల్-15లో గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ అందించిన హార్ధిక్.. జాతీయ జట్టులో కూడా ఆల్ రౌండర్ బాధ్యతను అనుకున్నదానికంటే ఎక్కువ నిర్వర్తిస్తున్నాడు. 

26
Image credit: PTI

బ్యాటర్ గానే గాక బౌలర్ గా కూడా రాణిస్తున్న హార్ధిక్ భారత్ కు మూడో స్పెషలిస్టు బౌలర్ లేని లోటును తీరుస్తున్నాడు.  ఆసియా కప్- 2022లో భాగంగా గత ఆదివారం పాకిస్తాన్ తో మ్యాచ్ లో బౌలింగ్ లో మూడు వికెట్లు తీయడమే గాక బ్యాటింగ్ లో 17 బంతుల్లో 33 పరుగులు చేయడంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అతడి ర్యాంకు మెరుగుపడింది. 

36
Image credit: PTI

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో  హార్ధిక్.. 8 స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో స్థానానికి చేరాడు. పాండ్యా కెరీర్ లో ఇదే బెస్ట్ ర్యాంక్.  167 రేటింగ్ పాయింట్లతో హార్ధిక్.. ఐదో స్థానంలో నిలిచాడు. 

46

ఈ జాబితాలో అఫ్గానిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ 261 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా బంగ్లాదేశ్  సారథి షకిబ్ అల్ హసన్ 232 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 221 పాయింట్లతో ఇంగ్లాండ్  ఆల్ రౌండర్ మోయిన్ అలీ మూడో స్థానంలో ఉండగా.. 183 పాయింట్లతో గ్లెన్ మ్యాక్స్‌వెల్ నాలుగో స్థానంలో నిలిచాడు. 

56

ఇక టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో బాబర్ ఆజమ్ తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని  చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం బాబర్ ఆజమ్ 810 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. మహ్మద్ రిజ్వాన్ 796 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 792 పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో నిలిచాడు. 

66
Image credit: PTI

బౌలర్ల విషయానికొస్తే.. 792 పాయింట్లతో  ఆసీస్ పేసర్ జోష్ హెజిల్వుడ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా దక్షిణాఫ్రికా స్పిన్నర్ షంషీ (716 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ (702), అదిల్ రషీద్ (ఇంగ్లాండ్.. 702), ఆడమ్ జంపా (ఆసీస్.. 702) తర్వాత స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో భారత్ నుంచి భువనేశ్వర్ కుమార్.. 661 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాడు. 

click me!

Recommended Stories