ఈసారి ఐపీఎల్‌ వేలంలో అతనే హాట్ కేక్... రికార్డు ధర కొడతాడంటున్న మాజీ క్రికెటర్...

Published : Jan 29, 2022, 09:33 AM ISTUpdated : Feb 03, 2022, 07:29 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలానికి చకా చకా ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. ఐపీఎల్‌లో ఎప్పుడూ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లకే డిమాండ్ ఎక్కువ. ఈసారి ఓ భారత ఆల్‌రౌండర్ రికార్డు ధర దక్కించుకుంటాడని అంటున్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

PREV
110
ఈసారి ఐపీఎల్‌ వేలంలో అతనే హాట్ కేక్... రికార్డు ధర కొడతాడంటున్న మాజీ క్రికెటర్...

ఇంగ్లాండ్ నెం.1 టీ20 హిట్టర్ డేవిడ్ మలాన్‌, ఐపీఎల్ 2021 వేలంలో కేవలం రూ. కోటి రూపాయలు మాత్రమే దక్కించుకున్నారు. మిగిలిన హిట్టర్ల పరిస్థితి ఇంతే...

210

సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ రికార్డు స్థాయిలో రూ.16.25 కోట్లు దక్కించుకోగా ప్యాట్ కమ్మిన్స్ రూ.15.50 కోట్లు, కేల్ జెమ్మీసన్ రూ.15 కోట్లు దక్కించుకున్నారు...

310

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయినా ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రూ.14.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ఆర్‌సీబీ...

410

కొన్నేళ్లుగా భారత స్టార్ ప్లేయర్లు ఎవ్వరూ ఐపీఎల్ వేలంలో కనిపించడం లేదు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారత స్టార్లు కూడా వేలంలో తమ లక్‌ను పరీక్షించుకోబోతున్నారు...

510

‘నా అంచనా ప్రకారం ఈసారి ఐపీఎల్ వేలంలో దీపక్ చాహార్ కోసం జట్లన్నీ పోటీపడబోతున్నాయి. అతను అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలుస్తాడని గట్టిగా నమ్ముతున్నా...

610

కీలక సమయంలో వికెట్లు తీయడం దీపక్ చాహార్ స్పెషాలిటీ. సీఎస్‌కే తరుపున పవర్ ప్లేలో వికెట్లు తీసి, ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు...

710

పరుగులు ఇచ్చినా, వికెట్లు ఎలా తీయాలో చాహార్‌కి బాగా తెలుసు. అదీకాకుండా ఇప్పుడు అతని బ్యాటింగ్ కూడా వెయ్యి రెట్లు మెరుగైంది...

810

శ్రీలంకతో, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచుల్లో దీపక్ చాహార్ మెరుపులు చూశాం. కాబట్టి జట్లన్నీ దీపక్ చాహార్‌ కోసం పోటీపడడం ఖాయం...

910

పవర్ ప్లేలో మూడు ఓవర్లు వేస్తే, రెండు నుంచి నాలుగు వికెట్లు తీయగలగడం దీపక్ చాహార్ బౌలింగ్‌లోని స్పెషాలిటీ. 

1010

ఈ క్వాలిటీ కూడా దీపక్ చాహార్‌ని హాట్ కేక్‌గా మార్చేసింది...సీఎస్‌కే కూడా దీపక్ చాహార్‌ అంత తేలిగ్గా వదులుకోవడానికి ఇష్టపడకపోవచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

click me!

Recommended Stories