11 ఏళ్ల క్రితమే సూర్యకుమార్ యాదవ్ సత్తా కనిపెట్టిన రోహిత్ శర్మ... సెంచరీ తర్వాత పాత ట్వీట్ వైరల్...

Published : Jul 11, 2022, 04:47 PM IST

టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా టాప్‌లో ఉంది భారత జట్టు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సెంచరీ చేసిన సూర్య... అతి పెద్ద వయసులో టీ20 శతకం బాదిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

PREV
110
11 ఏళ్ల క్రితమే సూర్యకుమార్ యాదవ్ సత్తా కనిపెట్టిన రోహిత్ శర్మ... సెంచరీ తర్వాత పాత ట్వీట్ వైరల్...

55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 117 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, కేవలం బౌండరీల ద్వారానే 92 పరుగులు రాబట్టాడు. సూర్య తర్వాత 28 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యరే టాప్ స్కోరర్‌గా ఉన్నాడు...
 

210

విజయానికి ఆఖరి 7 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన దశలో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు. యాదవ్ చివరిదాకా క్రీజులో ఉండి ఉంటే, టీమిండియా విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోయేది...

310

34 ఏళ్ల వయసులో టీమిండియా కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలోనూ బాధ్యతలు తీసుకున్నాడు రోహిత్ శర్మ. ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో 2012 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి ఆడిన సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత 2014 నుంచి 2017 వరకూ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఆడాడు...

410

2018లో ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, 2020 ఐపీఎల్ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. భారత జట్టులోకి వచ్చినప్పటి నుంచి టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ కీ ప్లేయర్‌గా మారిపోయాడు...

510

అయితే సూర్యకుమార్ యాదవ్‌లోని టాలెంట్‌ని 11 ఏళ్ల క్రితమే కనిపెట్టాడు రోహిత్ శర్మ. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో సూర్య సెంచరీతో రోహిత్ శర్మ పాత ట్వీట్ తెగ వైరల్ అవుతోంది...

610
Suryakumar Yadav

2011, డిసెంబర్ 10న ‘చెన్నైలో బీసీసీఐ అవార్డ్స్ ఫంక్షన్‌కి వెళ్లాడు. కొందరు టాలెంటెడ్ ప్లేయర్లు రాబోతున్నారు. ముంబైకి చెందిన సూర్యకుమార్ యాదవ్, ఫ్యూచర్‌లో అద్భుతంగా ఆడతాడు...’ అంటూ ట్వీట్ చేశాడు రోహిత్ శర్మ...
 

710

మూడో టీ20 ముగిసిన తర్వాత సూర్య ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడాడు రోహిత్ శర్మ. ‘ఓడిపోయినా మేం ఆడిన విధానానికి గర్వంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఆడుతుంటే చూడడానికి కన్నుల పండగగా ఉంటుంది. నేను ఎన్నో ఏళ్ల నుంచి అతని ఆటను చూస్తున్నా...

810

అతనికి టీ20 ఫార్మాట్‌ అంటే ఎంతో ఇష్టం. అతని దగ్గర ఎన్నో రకాల షాట్స్ ఉన్నాయి.. రోజురోజుకీ అతను మరింత మెరుగవుతూ టీమిండియాకి బలంగా మారుతున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ..

910

ఐపీఎల్ 2020 సీజన్‌లో 480 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, టైటిల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వరుసగా మూడు సీజన్లలో 400+ స్కోర్లు చేసిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు... ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని రూ.8 కోట్లకు అట్టిపెట్టుకుంది ముంబై ఇండియన్స్... 

1010

ఐపీఎల్ 2022 సీజన్‌ సమయంలో సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా సీజన్‌లో చాలా మ్యాచులకు అందుబాటులో లేకపోవడం ముంబై ఇండియన్స్‌పై విజయాలపై తీవ్రంగా ప్రభావం చూపింది... 

Read more Photos on
click me!

Recommended Stories