ఆట సరే, ‘శభాష్ మిథూ’లో మిథాలీ రాజ్ లవ్ స్టోరీ ఉంటుందా... ఆ క్రికెటర్‌తో ప్రేమాయణంలో...

Published : Jul 11, 2022, 02:24 PM IST

యాక్షన్, ఫాంటసీ, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా... సినిమా ఫిక్షన్ ఏదైనా అందులో లవ్ స్టోరీ ఉండాల్సిందే. ఎమ్మెస్ ధోనీ, సచిన్ టెండూల్కర్, అజారుద్దీన్‌ బయోపిక్ మూవీల్లోనూ లవ్ స్టోరీలున్నాయి. మరి మిథాలీరాజ్ సంగతేంటి? వుమెన్ క్రికెట్ వరల్డ్‌లో ‘లేడీ సచిన్’గా గుర్తింపు తెచ్చుకున్న మిథాలీరాజ్ జీవితంలో ఏదైనా లవ్‌స్టోరీ ఉందా? ఉంటే దాన్ని ‘శభాష్ మిథూ’లో చూపిస్తారా?...

PREV
110
ఆట సరే, ‘శభాష్ మిథూ’లో మిథాలీ రాజ్ లవ్ స్టోరీ ఉంటుందా... ఆ క్రికెటర్‌తో ప్రేమాయణంలో...

భారత మహిళా టీమ్ కెప్టెన్‌గా, లెజెండరీ బ్యాటర్‌గా క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకుంది మిథాలీ రాజ్. వన్డే వరల్డ్ కప్ 2022 తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన మిథాలీ బయోపిక్ ‘శభాష్ మిథూ’ జూలై 15న విడుదల కానుంది. 

210

16 ఏళ్ల టీనేజ్ వయసులో టీమిండియాలోకి వచ్చిన మిథాలీ రాజ్, 39 ఏళ్ల వయసులో క్రికెట్ నుంచి తప్పుకుంది. ‘శభాష్ మిథూ’ ఆమె క్రికెట్ కెరీర్‌లో ఎదుర్కొన్న అవమానాలు, అనుభవాలు అన్నీ ఉంటాయి. అయితే ఇంత వయసొచ్చినా మిథాలీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఆమె జీవితంలో ఎవ్వరికీ తెలియని లవ్ ఫెయిల్యూర్ ఉందా...

310
Mithali Raj

డిసెంబర్ 3, 1982న రాజస్థాన్‌లో జోద్‌పూర్‌లో జన్మించిన మిథాలీ రాజ్, హైదరాబాద్‌లో చదువుకుంది. ఆంధ్రా టీమ్ తరుపున దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడిన మిథాలీ రాజ్... ఎయిర్ ఇండియా, రైల్వేస్ టీమ్స్ తరుపున కూడా ప్రాతినిథ్యం వహించింది...

410
Mithali Raj

39 ఏళ్ల మిథాలీ రాజ్, ఇప్పటిదాకా ఎందుకు పెళ్లి చేసుకోలేదనేది ఎవ్వరికీ తెలియని విషయం. కొందరు క్రికెట్‌కే తన కెరీర్‌ని అంకితం చేసిందని అంటారు, మరికొందరు లవ్ ఫెయిల్యూర్‌ అంటారు.. వాస్తవానికి మిథాలీ రాజ్‌కి 22 ఏళ్లు వచ్చినప్పటి నుంచి ఆమె కోసం పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు కుటుంబసభ్యులు...

510

అయితే క్రికెట్‌తో బిజీగా ఉండే మిథాలీరాజ్, ఎన్ని సంబంధాలు వచ్చినా వాటిని రిజెక్ట్ చేసేసింది. 27-30 ఏళ్లు వచ్చిన తర్వాత మిథాలీ రాజ్ పెళ్లి గురించి ఆలోచన చేసిందట.అయితే అప్పుడు వచ్చిన సంబంధాల్లో చాలా మంది క్రికెట్‌ని వదిలేయాలని చెప్పడంతో వారిని వదిలేసిందట మిథాలీ...
 

610

ఇలా మిథాలీ రాజ్ క్రికెట్ కోసం తన పర్సనల్ లైఫ్‌ని, మ్యారేజ్ లైఫ్‌ని త్యాగం చేసేసింది. అయితే పెళ్లి చేసుకోనందుకు తానేం బాధపడడం లేదని, సింగిల్ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్నానని అంటుంది మిథాలీరాజ్...

710

‘కొన్నాళ్ల క్రిందట నాకు పెళ్లి ఆలోచన వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఎందుకంటే పెళ్లైన వాళ్లను చూసిన తర్వాత సింగిల్‌గా ఉండడమే చాలా బెటర్ అనిపిస్తోంది... ’ అంటూ కామెంట్ చేసింది మిథాలీ రాజ్...
 

810

మిథాలీరాజ్, భారత సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్‌తో ప్రేమలో ఉందని, త్వరలో ఈ ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. శిఖర్ ధావన్‌కి ఇప్పటికే పెళ్లై, విడాకులు కూడా అయ్యాయి...

910

తన కంటే 10 ఏళ్లు పెద్దదైన అయేషా ముఖర్జీని పెళ్లి చేసుకుని, 8 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్నాడు శిఖర్ ధావన్.. మరి మిథాలీరాజ్‌, శిఖర్ ధావన్‌ల మధ్య ప్రేమ కహానీ నిజమైతే అది గబ్బర్ పెళ్లికి ముందు జరిగిందా? లేక ఆ తర్వాత జరిగిందా?
 

1010

శిఖర్ ధావన్ పెళ్లి అయ్యాక మిథాలీతో ప్రేమ చిగురించి, గబ్బర్ విడాకులు తీసుకోవడానికి కారణంగా మారిందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మిథాలీరాజ్, శిఖర్ ధావన్‌‌ల మధ్య ఏదో ఉందనే వార్త ఉట్టి పుకారే అని చాలా మంది అభిప్రాయం.. మరి మిథాలీ పర్సనల్ లైఫ్‌లోని ఈ సీక్రెట్స్ అన్నీ ‘శభాష్ మిథూ’లో చూపిస్తారా? లేదా? తెలియాలంటే జూలై 15న సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే..

click me!

Recommended Stories