IPL2021: డేవిడ్ వార్నర్‌కి అవమానం... స్టేడియానికి కూడా రానివ్వని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్...

First Published Oct 1, 2021, 3:12 PM IST

డేవిడ్ వార్నర్... సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి టైటిల్ అందించిన కెప్టెన్. సరైన ప్లేయర్లను కొనుగోలు చేయకుండా, టీమ్ మేనేజ్‌మెంట్ టైమ్ పాస్ చేస్తున్నా... తన నాయకత్వంతో జట్టును సమర్థవంతంగా నడిపిస్తూ, బ్యాటింగ్ భారాన్ని మోసిన నాయకుడు...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి వచ్చిన క్రేజ్, ఫాలోయింగ్‌కి కారణం కూడా డేవిడ్ వార్నర్. ఐదు సీజన్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న వార్నర్, మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచాడు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం ఎంతో చేసిన డేవిడ్ వార్నర్‌ను ఘోరంగా అవమానిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్. సీజన్ ఫస్టాఫ్‌లో మనీశ్ పాండేను ఎందుకు ఎంపిక చేయలేదో తెలియదని వార్నర్ చేసిన కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న టీమ్‌ మేనేజ్‌మెంట్, అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే...

ఆ తర్వాత జట్టులో నుంచి తీసేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, ఇప్పుడు డేవిడ్ వార్నర్‌ను మ్యాచ్ చూడడానికి కూడా స్టేడియానికి రానివ్వడం లేదట...

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టేడియంలో కనిపించిన డేవిడ్ వార్నర్, ఫ్యాన్స్ ఫీల్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కి రావాలని భావించాడు...

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అతన్ని టీమ్ బస్సులో ఎక్కడానికి అనుమతించలేదు... దీనికి కారణం వార్నర్‌పై సోషల్ మీడియాలో వస్తున్న సానుభూతే...

సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల్లో వార్నర్ డగౌట్‌లో కనిపిస్తే, అతని మీదే ఫోకస్ అంతా ఉంటుంది. జట్టును నడిపించిన కెప్టెన్‌కి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటూ ట్రోల్స్ మొదలవుతాయి...

వీటిని ఎదుర్కోవడం ఇష్టం లేని సన్‌రైజర్స్ హైదరాబాద్, స్టేడియంలో మ్యాచ్ చూడడానికి కూడా డేవిడ్ వార్నర్‌ను అనుమతించలేదని సమాచారం... ఇది తెలిసిన వార్నర్ భాయ్ ఫ్యాన్స్, సన్‌రైజర్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు...

ఐపీఎల్ వేలంలో టీ, కాఫీలు, తాగుతూ, స్నాక్స్ తింటూ కాలక్షేపం చేయకుండా మంచి ప్లేయర్లను కొనుగోలు చేసి ఉంటే, జట్టు పరిస్థితి ఇలా తయారయ్యేది కాదంటూ కామెంట్లు చేస్తున్నారు...

ఇప్పటికే 11 మ్యాచుల్లో 9 మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. వార్నర్ భాయ్‌ని ఇలా అవమానిస్తే, ఆరెంజ్ ఆర్మీకి ఉన్న కాస్తో కూస్తో ఫాలోయింగ్ కూడా పోతుందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

click me!