ఆ ఇద్దరికీ అవకాశం ఇవ్వండి, స్టార్లుగా మారతారు... బీసీసీఐకి దినేశ్ కార్తీక్ సూచన...

Published : Jan 29, 2022, 11:08 AM IST

సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియాలో ఉన్న లోపాలన్నీ బయటపడ్డాయి. మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో పాటు బౌలర్ల పేలవ ప్రదర్శన కూడా భారత జట్టును తీవ్రంగా వేధించాయి...

PREV
113
ఆ ఇద్దరికీ అవకాశం ఇవ్వండి, స్టార్లుగా మారతారు... బీసీసీఐకి దినేశ్ కార్తీక్ సూచన...

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టూర్లలో అదరగొట్టిన భారత బౌలర్లు, సౌతాఫ్రికా టూర్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు...

213

మొదటి టెస్టులో 20 వికెట్లు తీసి, భారత జట్టుకి అద్భుత విజయాన్ని అందించిన భారత బౌలర్లు, ఆ తర్వాత రెండు టెస్టుల్లో కలిపి 26 వికెట్లు మాత్రమే తీయగలిగారు...

313

వన్డే సిరీస్‌లోనూ భారత బౌలర్ల నుంచి చెప్పుకోదగ్గ పర్పామెన్స్ అయితే రాలేదు. సౌతాఫ్రికా స్పిన్నర్లు సూపర్ సక్సెస్ అయితే భారత స్పిన్నర్లు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు...

413

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత జట్టుకి యంగ్ ఫాస్ట్ బౌలర్ల అవసరం చాలా ఉంది. ఇకపై సీనియర్లతో పాటు యంగ్ బౌలర్లపై కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది...

513

ప్రసిద్ధ్ కృష్ణకి ఇప్పటికే టీమిండియాలో చోటు దక్కింది. ఆ అవకాశాలను అతను చక్కగా వాడుకున్నాడు కూడా. ప్రసిద్ధ్ చాలా స్పెషల్ బౌలర్...

613

అతను ఎవరి సలహాలు, సూచనలు తీసుకోవాలని అనుకోడు. రవి అశ్విన్‌లా స్వతంత్రంగా  ఆలోచించి, పరిస్థితికి తగ్గట్టుగా బౌలింగ్‌లో మార్పులు చేసుకుంటాడు...

713

ఇలాంటి బౌలర్ ఉంటే బెస్ట్ బ్యాట్స్‌మెన్లకు కూడా ఇబ్బంది పట్టొచ్చు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ పొదుపుగా బౌలింగ్ చేయలేడు...

813

అతను 10 ఓవర్లు వేస్తే 70 పరుగులిచ్చి 2 లేదా 3 వికెట్లు తీస్తాడు. అతనిపై కాస్త ఫోకస్ పెట్టి రాటుతేలిస్తే పరుగులు ఇవ్వకుండా వికెట్లు రాబట్టగలుగుతాడు...

913

డెత్ బౌలర్లలో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టడం కూడా ప్రసిద్ధ్ కృష్ణకు బాగా తెలుసు. అయితే మ్యాచ్ విన్నర్‌గా మారేందుకు అతనికి కొంత సమయం పడుతుంది...

1013

భారత క్రికెట్‌కి ఉపయోగపడే మరో బౌలర్ శివమ్ మావి. 140+ కి.మీ.ల వేగంతో బంతులు విసిరే శివమ్ మావి బౌలింగ్, విదేశీ పిచ్‌లకు సరిగ్గా సూట్ అవుతుంది...

1113

శివమ్ మావి, ఉత్తరప్రదేశ్‌కి ఆడుతున్నాడు. అక్కడ భువనేశ్వర్ కుమార్, యష్ ధయాల్ వంటి చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ఉండడం వల్ల మావికి పెద్దగా అవకాశాలు రావడం లేదు...

1213

ఐపీఎల్‌లో కూడా శివమ్ మావి ఏం చేయగలడో అందరూ చూశారు. అయితే మావిలో అంతకుమించి టాలెంట్ ఉంది. అయితే అది బయటికి రావాలంటే సరైన శిక్షణ కావాలి...

1313

రాహుల్ ద్రావిడ్ వంటి లెజెండ్ చేతుల్లో పడితే ఈ ఇద్దరు కుర్రాళ్లు... కచ్ఛితంగా స్టార్ బౌలర్లుగా మారతారు...’ అంటూ కామెంట్ చేశాడు భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్...

click me!

Recommended Stories