మావాళ్లయితే ఈ టార్గెట్ కొట్టడానికి 50 ఓవర్లు ఆడేవాళ్లు... పాక్ మాజీ పేసర్ డానిష్ కనేరియా...

First Published Aug 22, 2022, 12:44 PM IST

జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 161 పరుగుల లక్ష్యఛేదనలో 5 వికెట్లు కోల్పోయింది. ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ కెఎల్ రాహుల్ 1 పరుగుకే అవుట్ అయినా శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్, సంజూ శాంసన్ కలిసి మ్యాచ్‌ని ముగించారు... 

Sanju Samson

25.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు, వన్డే సిరీస్‌ని 2-0 తేడాతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. అయితే జింబాబ్వేపై 161 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో ఐదు వికెట్లు కోల్పోవడంపై పెద్ద చర్చ జరిగింది... భారత టాపార్డర్ బ్యాటర్లు, జింబాబ్వే బౌలర్లను కూడా సరిగ్గా ఫేస్ చేయలేకపోయారనే విమర్శలు వినిపించాయి...

Sanju Samson

‘చాలామంది పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్, జింబాబ్వేపై 161 పరుగుల లక్ష్యఛేదనలో భారత జట్టు ఐదు వికెట్లు కోల్పోయిందని హేళన చేశారు. అయితే మనం గుర్తించాల్సింది వాళ్లు ఆడిన తీరు. అటాకింగ్ మంత్రంతో కేవలం 25 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించేశారు...

Shikhar Dhawan - Sanju Samson

ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుని ఉంటే... ఆరంభంలో రెండు-మూడు వికెట్లు పడితే 160 కొట్టడానికి 50 ఓవర్లు తీసుకునేవాళ్లు.. అది మనవాళ్ల బ్యాటింగ్ తీరు...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా...

shaheen

పాక్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి  దూరమైన విషయం తెలిసిందే. షాహీన్ లేని లోటు పాక్‌పై తీవ్రంగా పడనుంది. దీంతో అతన్ని మూడు ఫార్మాట్లు ఆడిస్తున్న పాక్ క్రికెట్ బోర్డు, టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు చేశాడు డానిష్ కనేరియా...

shaheen

‘షాహీన్ ఆఫ్రిదీ ఆసియా కప్ ‌2022కి దూరమయ్యాడు. దీనికి పీసీబీ బాధ్యత వహించాల్సిందే. నేను దాదాపు ఏడాదిగా ఈ విషయం గురించి మొత్తుకుంటున్నా. అతన్ని ఇలా వరుస టోర్నీలు ఆడించడం కరెక్ట్ కాదని, విశ్రాంతి కల్పించాలని చెబుతూనే ఉన్నా...

shaheen

ఇప్పుడు నేను చెప్పినట్టే జరిగింది, అది కూడా ఓ మెగా టోర్నమెంట్ ముందు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌కి కూడా షాహీన్ ఆఫ్రిదీని ఆడించాల్సిన అవసరం ఉందా.. మూడు ఫార్మాట్లలో అన్ని గేమ్‌లకు అతను అందుబాటులో ఉండాలని కోరుకోవడం కరెక్ట్ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా... 

click me!