CSK vs SRH: వార్నర్ వర్సెస్ ధోనీ... నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

First Published Oct 2, 2020, 4:17 PM IST

IPL 2020 సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది చెన్నై సూపర్ కింగ్స్. మొదటి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టును చిత్తుగా ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోంది ధోనీ జట్టు. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలబడుతోంది సీఎస్‌కే. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

డేవిడ్ వార్నర్: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌లో అత్యంత కీలకంగా మారాడు డేవిడ్ వార్నర్. అయితే వార్నర్ నుంచి ఇప్పటిదాకా అతని స్థాయికి తగిన ప్రదర్శన రాలేదు. చెన్నైపై వార్నర్ ఎలా ఆడతాడో చూడాలి.
undefined
అంబటి రాయుడు: మొదటి మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు అంబటి రాయుడు. గాయం కారణంగా రెండు మ్యాచుల్లో బరిలో దిగని అంబటి రాయుడు, నేటి మ్యాచ్‌లో ఆడబోతున్నాడు. సొంతజట్టు హైదరాబాద్‌పై అంబటి రాయుడు ఎలా ఆడతానేది ఆసక్తికరంగా మారింది.
undefined
బెయిర్‌స్టో: బ్యాటింగ్‌లో ఆకట్టుకుంటున్నా... నిలకడగా ఆడలేకపోతున్నాడు బెయిర్‌స్టో. చెన్నైపై బెయిర్ స్టో నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది సన్‌రైజర్స్ హైదరాబాద్.
undefined
షేన్ వాట్సన్: చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ షేన్ వాట్సన్ ఈ సీజన్‌లో వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. వాట్సన్ ఫామ్‌లోకి వస్తే చెన్నై కష్టాలు సగం తీరినట్టే.
undefined
కేన్ విలియంసన్: గత మ్యాచ్‌లో అవసరమైన సమయంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు కేన్ విలియంసన్. నేటి మ్యాచ్‌లో కూడా కేన్ విలియంసన్ నుంచి అలాంటి స్పెషల్ ఇన్నింగ్స్ కోరుకుంటోంది ‘ఆరెంజ్ ఆర్మీ’...
undefined
డుప్లిసిస్: ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు డుప్లిసిస్. ఇప్పటిదాకా జరిగిన మూడు మ్యాచుల్లో అద్భుతంగా ఆడాడు. సన్‌రైజర్స్‌పై కూడా డుప్లిసిస్ నుంచి ఓ స్పెషల్ ఇన్నింగ్స్ కోరుకుంటోంది సీఎస్‌కే.
undefined
మనీశ్ పాండే: ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిన రెండు మ్యాచుల్లోనూ ఆకట్టుకున్నాడు మనీశ్ పాండే. అయితే ఢిల్లీపై ఫెయిల్ అయ్యాడు పాండే. నేటి మ్యాచ్‌లో పాండే నుంచి మెరుపు ఇన్నింగ్స్ వస్తే హైదరాబాద్ కష్టాలు తీరినట్టే.
undefined
రుతురాత్ గైక్వాడ్: రైనా గైర్హజరీతో రుతురాజ్ గైక్వాడ్‌పై భారీ ఆశలు పెట్టుకుంది చెన్నై జట్టు. అయితే యంగ్ బ్యాట్స్‌మెన్ నుంచి ఇప్పటిదాకా సరైన ఇన్నింగ్స్ రాలేదు.
undefined
రవీంద్ర జడేజా: జడ్డూ ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉన్న ప్లేయర్లలో ఒకడు. అయితే ఈ సీజన్‌లో జడేజా ఇంకా టచ్‌లోకి రాలేదు.
undefined
భువనేశ్వర్ కుమార్: మొదటి రెండు మ్యాచుల్లో ఇబ్బందిపడిన భువీ, గత మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించాడు. అయితే భువనేశ్వర్ రేంజ్ పర్పామెన్స్ మాత్రం ఇప్పటిదాకా చూపలేదు.
undefined
రషీద్ ఖాన్: గత మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి, మ్యాజిక్ చేశాడు రషీద్ ఖాన్. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చిన రషీద్ ఖాన్, మళ్లీ అలాంటి పర్ఫామెన్స్ ఇస్తే సన్‌రైజర్స్ విజయం పెద్ద కష్టమేమీ కాదు.
undefined
మురళీ విజయ్: గత సీజన్‌లో మురళీ విజయ్ నుంచి కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు వచ్చాయి. అయితే ఈ సీజన్‌లో మాత్రం విజయ్ వరుసగా ఫెయిల్ అవుతూ చెన్నైని కష్టాల్లో పడేస్తున్నాడు.
undefined
దీపక్ చాహార్: హర్భజన్ సింగ్ లేకపోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడని దీపక్ చాహార్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాడు ధోనీ. అయితే చాహార్ నుంచి అలాంటి ప్రదర్శన అయితే ఇప్పటిదాకా రాలేదు.
undefined
మహేంద్ర సింగ్ ధోనీ: మహేంద్ర సింగ్ ధోనీ ఆటతీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ట్రోల్స్ వచ్చిన ప్రతీసారీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పే ధోనీ, ఈసారి కూడా అలాంటి ప్రదర్శన ఇస్తాడని కోరుకుంటున్నాడు మాహీ ఫ్యాన్స్.
undefined
డ్వేన్ బ్రావో: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మిస్ అయిన ఆల్‌రౌండర్లలో డ్వేన్ బ్రావో ఒకడు. గాయం కారణంగా జట్టుకి దూరమైన బ్రావో, నేటి మ్యాచ్‌లో బరిలో దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
undefined
నటరాజన్: అద్భుతమైన యార్కర్లతో ఢిల్లీపై మ్యాచ్‌లో అదరగొట్టాడు టి. నటరాజన్. ఎలాంటి బౌలర్‌నైనా ఊచకోత కోసే చెన్నై టీమ్‌పై నటరాజన్ ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తాడో చూడాలి.
undefined
click me!