IPL 2020: అన్న అటు... తమ్ముడు ఇటు... ఐపీఎల్‌లో పోటీపడిన సోదరులు ఎవరంటే.

First Published Oct 1, 2020, 7:44 PM IST

IPL 2020: తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే... క్రికెట్ మైదానంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కొందరు అన్నాదమ్ములు ఒకే జట్టుకి ఆడగా... మరికొందరు ప్రత్యర్థులుగా క్రికెట్ మైదానంలో తలబడ్డారు.  ఇప్పటిదాకా క్రికెట్‌లో బాగా పాపులారిటీ సంపాదించిన అన్నాదమ్ములు వీళ్లు.

పఠాన్ బ్రదర్స్: భారత క్రికెట్‌లో అన్నాదమ్ములంటే నేటితరానికి ముందుగా గుర్తొచ్చేది పఠాన్ బ్రదర్స్‌యే. స్టార్ పేసర్ ఇర్ఫాన్ పఠాన్, ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్... ఐపీఎల్‌లో ప్రత్యర్థులుగా కూడా వేర్వేరు జట్లకు ఆడారు.
undefined
పాండ్యా బ్రదర్స్: స్టార్ ఆల్‌రౌండర్లు హర్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా భారత జట్టులో కూడా స్థానం సంపాదించారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హార్దిక్ పాండ్యా భారత జట్టులో కూడా స్థిరమైన చోటు దక్కించుకోగా, అన్న కృనాల్ అప్పుడప్పుడూ జట్టులోకి వచ్చి పోతున్నాడు.
undefined
మార్ష్ బ్రదర్స్: ఆస్ట్రేలియా జట్టుకు ఆడిన ఈ ఇద్దరు సోదరులు... ఐపీఎల్‌లో కూడా ఆకట్టుకున్నారు. అన్న షాన్ మార్ష్ 2008 ఐపీఎల్ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకోగా... తమ్ముడు మిచెల్ మార్ష్ ఆల్‌రౌండర్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్న మిచెల్ మార్ష్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు.
undefined
మెక్‌కల్లమ్ బ్రదర్స్: ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీ చేసిన క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్. బ్రెండన్ మెక్‌కల్లమ్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ప్రాతినిథ్యం వహించగా... తమ్ముడు నాథన్ మెక్‌కల్లమ్ కేవలం రెండు ఐపీఎల్ మ్యాచులు మాత్రమే ఆడాడు.
undefined
చాహార్ బ్రదర్స్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక బౌలర్ దీపక్ చాహార్. ముంబై ఇండియన్స్ టీమ్‌లో కీలక బౌలర్‌గా ఉన్నాడు రాహుల్ చాహార్. ఈ ఇద్దరూ కూడా చాహార్ బ్రదర్స్‌గా గుర్తింపు పొందారు. అయితే దీపక్, రాహుల్ సొంత అన్నాదమ్ములు కాదు, బంధువులు అవుతారంతే...
undefined
IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్రదర్స్ సామ్ కుర్రాన్, టామ్ కుర్రాన్ ప్రత్యర్థులుగా ఆడుతున్నారు. ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతుండగా, టామ్ కుర్రాన్ రాజస్థాన్ రాయల్స్ తరుపున బరిలో దిగుతున్నాడు.
undefined
click me!