CSKvsKKR: దంచికొట్టిన రుతురాజ్, డుప్లిసిస్... ధోనీ మెరుపులు, చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు..

Published : Apr 21, 2021, 09:23 PM IST

IPL 2021 సీజన్‌లో తన రేంజ్ పర్ఫామెన్స్‌తో అదరగొడుతున్న చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ స్కోరు చేసింది. యంగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు డుప్లిసిస్ హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరు చేసింది సీఎస్‌కే...

PREV
18
CSKvsKKR: దంచికొట్టిన రుతురాజ్, డుప్లిసిస్... ధోనీ మెరుపులు, చెన్నై సూపర్ కింగ్స్  భారీ స్కోరు..

టాస్ ఓడి, బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌కి రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్ కలిసి అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. రుతురాజ్ వరుస బౌండరీలతో కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగగా డుప్లిసిస్ అతనికి స్ట్రైయికింగ్ ఇవ్వడానికి ప్రాధాన్యం ఇచ్చాడు.

28

గత సీజన్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఈ సీజన్‌లో తొలి అర్ధశతకం నమోదుచేశాడు. 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

38

రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లిసిస్ కలిసి 12.1 ఓవర్లలోనే మొదటి వికెట్‌కి 115 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదుచేయడం విశేషం. 

48

వన్‌డౌన్‌లో వచ్చిన మొయిన్ ఆలీ, 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో 165 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది సీఎస్‌కే...

58

బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, టూ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు. వస్తూనే ఆడిన రెండో బంతికి బౌండరీ బాదిన ధోనీ, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాదాడు.

68

ఆండ్రే రస్సెల్ వేసిన 19వ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన డుప్లిసిస్... స్కోరును 200 దాటించాడు. అయితే అదే ఓవర్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన ధోనీ, 8 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసి మోర్గాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

78

ప్యాట్ కమ్మిన్స్ వేసిన 20వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన డుప్లిసిస్, ఆఖరి ఓవర్ ఐదో బంతికి సింగిల్ తీయడంతో 60 బంతుల్లో 9 ఫోర్లు,  4 సిక్సర్లతో 95 పరుగులు చేసి సెంచరీ మిస్ అయ్యాడు.

88

ఆఖరి బంతికి రవీంద్ర జడేజా సిక్సర్ బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

click me!

Recommended Stories