CSK captain MS Dhoni's worst record in ipl history in Chepauk
CSK vs KKR IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి చెత్త ప్రదర్శనతో చిత్తుగా ఓడిపోయింది. ఐపీఎల్ 2025 25వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఏ సమయంలోనూ ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ అజింక్యా రహానే కెప్టెన్సీలోని కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కు పోటీని ఇవ్వలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమై చిత్తుగా ఓడిపోయింది.
CSK captain MS Dhoni's worst record in ipl history in Chepauk
ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై టీమ్ చెత్త బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. 20 ఓవర్లు ముగిసే సరికి 103/9 పరుగులు మాత్రమే చేసింది. ఈజీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ కేవలం 10.1 ఓవర్ లోనే 107/2 పరుగులతో విజయం సాధించింది.
CSK captain MS Dhoni's worst record in ipl history in Chepauk
ఈ ఓటమితో చెన్నై టీమ్ ఐపీఎల్ 2025 లో చెత్త రికార్డులను నమోదుచేసింది. ఐపీఎల్ 2025లో సీఎస్కే ఆడిన 6 మ్యాచ్ లలో 5 ఓడిపోయింది. రుతురాజ్ గైక్వాడ్ తర్వాత ఎంఎస్ ధోని కెప్టెన్సీ కూడా చెన్నై టీమ్ కు విజయాన్ని అందించలేకపోయింది. చెన్నై జట్టు కేకేఆర్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో, ఐపీఎల్‌లో ధోని కెప్టెన్సీ కూడా చెత్త రికార్డును నమోదుచేసింది. చెపాక్‌లో అవమానకరమైన రికార్డు సృష్టించింది.
CSK captain MS Dhoni's worst record in ipl history in Chepauk
ధోని కెప్టెన్సీలో చెపాక్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టింది సీఎస్కే. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే టీమ్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. శివం దూబే 31, విజయ్ శంకర్ 29 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులకు చేరుకుంది. కేకేఆర్ ఈజీగానే టార్గెట్ ను అందుకుంది. దీంతో చెపాక్‌లో ధోని కెప్టెన్సీపై మచ్చ పడింది. చెపాక్‌లో సీఎస్కే వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. కేకేఆర్ కు ముందు ఆర్సీబీ, డీసీ జట్లు కూడా చెన్నై సూపర్ కింగ్స్ ను హోం గ్రౌండ్ లో ఓడించాయి.
CSK captain MS Dhoni's worst record in ipl history in Chepauk
చెపాక్‌లో సీఎస్కే ఇంత తక్కువ స్కోరు చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. అది కూడా ధోని కెప్టెన్సీలో కావడం గమనించాల్సిన విషయం. అలాగే, చెపాక్ గ్రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి.
ఈ మ్యాచ్ తో ఎంఎస్ ధోని మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. అతని నుంచి మంచి ఇన్నింగ్స్ ను ఆశించిన క్రికెట్ అభిమానుల గుండెలను బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్ లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి మహీ పెవిలియన్ కు చేరాడు. ధోని ఆడటానికి చాలా ఓవర్లు ఉన్నా అతను ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. సునీల్ నరైన్ బౌలింగ్ లో ధోని ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.