SRH IPL : ఐదుగురు స్టార్ ఆటగాళ్లకు సన్‌రైజర్స్ వీడ్కోలు

Published : May 06, 2025, 06:08 PM IST

IPL 2025: టైటిల్ ఫేవ‌రెట్ గా ఐపీఎల్ 2025 మెగా టోర్నీని ప్రారంభించిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టోర్నీ చివ‌రి ద‌శ‌కు చేరుకోక‌ముందే దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్ అయింది. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ ప‌లువ‌రు స్టార్ ప్లేయ‌ర్ల‌కు గుడ్ బై చెప్ప‌డానికి సిద్ధ‌మైంద‌ని క్రికెట్ స‌ర్కిల్ లో టాక్ న‌డుస్తోంది.   

PREV
16
SRH IPL : ఐదుగురు స్టార్ ఆటగాళ్లకు సన్‌రైజర్స్ వీడ్కోలు

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఫైనల్‌ వరకు దూసుకొచ్చింది. కానీ, కోల్ క‌తా నైట్‌రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్ టైటిల్ అడుగు దూరంలో నిలిచింది. అయితే,  హైద‌రాబాద్ టీమ్ ఐపీఎల్ 2025లో టైటిల్ ఫేవ‌రెట్ గా టోర్న‌మెంట్ ను ప్రారంభించింది. 

కానీ అందుకు త‌గ్గ ఫ‌లితాలు రాబ‌ట్ట‌డంతో విఫ‌ల‌మైంది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో  కేవ‌లం 3 విజ‌యాలు సాధించింది. 8 మ్యాచ్ ల‌లో ఓడిపోయింది. దీంతో అధికారికంగా ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ రేసు నుంచి అవుట్ అయింది. ఈ నేపథ్యంలో హైద‌రాబాద్ జట్టు యాజమాన్యం, ముఖ్యంగా సీఈఓ కావ్యా మారన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. రాబోయే ఐపీఎల్ సీజ‌న్ కు ముందు ప‌లువురు స్టార్ ప్లేయ‌ర్ల‌కు గుడ్ బై చెప్ప‌నున్నార‌ని క్రికెట్ స‌ర్కిల్ లో టాక్ న‌డుస్తోంది. అలాంటి వారిలో ఐదుగురు ప్లేయ‌ర్ల వివ‌రాలు గ‌మ‌నిస్తే.. 
 

26

1. ఇషాన్ కిషన్

భారత వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్‌ను హైద‌రాబాద్ టీమ్ మెగా వేలంలో రూ.11.40 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై సెంచ‌రీతో ఈ సీజ‌న్ ను ప్రారంభించిన ఇషాన్ కిష‌న్ ఆ త‌ర్వాత పెద్ద ఇన్నింగ్స్ ల‌ను ఆడలేక‌పోయాడు. 10 మ్యాచ్‌లలో కేవలం 196 పరుగులే కొట్టాడు. కోట్ల రూపాయ‌లు వెచ్చించ‌గా ఇషాన్ కిష‌న్ దానికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌లేదు.

36

2. హెన్రిచ్ క్లాసెన్

2025 సీజన్‌కు ముందు క్లాసెన్‌ను స‌న్ రైజ‌ర్స్ రూ.23 కోట్లకు రిటైన్ చేసింది. కానీ తొలి 10 మ్యాచ్‌ల్లో 311 పరుగులు మాత్రమే చేశారు. ఈ స్టార్ ప్లేయ‌ర్ పై భారీ అంచ‌నాలు ఉండ‌గా, అందుకు త‌గ్గ‌ట్టుగా రాణించ‌లేక‌పోయాడు. అందుకే క్లాసెన్ వ‌దులుకోవ‌చ్చ‌ని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 

46

3. మహ్మద్ షమీ

భార‌త స్టార్ పేసర్ షమిని హైద‌రాబాద్ జ‌ట్టు రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో 6 వికెట్లతో నిరాశపరిచారు. ఇక్కడ ష‌మీ ఎకానమీ రేట్ 11.23గా నమోదైంది. అత‌ని ఫిట్ నెస్, ఫామ్ క్ర‌మంలో రాబోయే సీజ‌న్ కు ముందు వ‌దులుకోవాల‌నే ఆలోచ‌న‌లో స‌న్ రైజర్స్ ఉంద‌ని టాక్. 

56

4. రాహుల్ చాహర్

రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసిన రాహుల్ చాహర్‌కు జట్టులో అవకాశంఇవ్వ‌లేదు. ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన ఆయన కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ వేసారు. యాజమాన్యం ఆసక్తి చూపకపోవడం వల్ల విడుదల ఖాయమని భావిస్తున్నారు.

66

5. జయదేవ్ ఉనాద్కత్

గత వేలంలో సన్‌రైజర్స్ జయదేవ్ ఉనద్కత్ ను కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. జయదేవ్ 4 మ్యాచ్‌లలో 6 వికెట్లు తీశారు. అయితే గతంలోనూ ఎన్నో జట్లు అతన్ని విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పుడు హైద‌రాబాద్ టీమ్ కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories