IPL 2025 SRH vs DC: వ‌ర్షం దెబ్బ‌.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ vs స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ్యాచ్ ర‌ద్దు

Published : May 05, 2025, 11:34 PM IST

IPL 2025 SRH vs DC: ఉప్ప‌ల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ vs స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌ధ్య జ‌రిగిన ఐపీఎల్ 2025 55వ మ్యాచ్ ర‌ద్దు అయింది. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దుకావ‌డంతో ఇరు జ‌ట్లకు చెరో పాయింట్ ల‌భించింది.   

PREV
16
IPL 2025 SRH vs DC: వ‌ర్షం దెబ్బ‌.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ vs స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ్యాచ్ ర‌ద్దు

IPL 2025 SRH vs DC: అనుకున్న‌దే జ‌రిగింది. హైద‌రాబాద్ లో వ‌ర్షం దంచికొట్టింది. దీంతో ఉప్ప‌ల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ vs స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌ధ్య జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 55వ మ్యాచ్ ర‌ద్దు అయింది.

వ‌ర్షం ఈ మ్యాచ్ ను దెబ్బ‌కొట్టింది. మ్యాచ్ ర‌ద్దుకావ‌డంతో ఇరు జ‌ట్లకు చెరో పాయింట్ ల‌భించింది. దీంతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్ అయింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ 13 పాయింట్ల‌తో 5వ స్థానంలో కొన‌సాగుతోంది. 

26

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ కు దిగింది. ఉప్పల్ స్టేడియం అంటేనే పరుగుల వర్షం కురుస్తుంది. ఢిల్లీ నుంచి అలాంటి ఇన్నింగ్స్ వస్తుందని అందరూ భావించారు. కానీ, పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా మారడంతో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.

36

ఢిల్లీకి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ డీసీ ని దెబ్బకొట్టాడు. అద్భుతమైన బౌలింగ్ తో ఢిల్లీ టాపార్డర్ ను పెవిలియన్ కు పంపాడు. బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ 4 ఓవర్లలో కేవ‌లం 19 ప‌రుగులు ఇచ్చి కీల‌క‌మైన 3 వికెట్లు తీసుకున్నాడు. 

46

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ 7 వికెట్లకి 133 పరుగులు మాత్రమే చేసింది. ఒకానొక సమయంలో 100 కూడా దాటలేమేమో అనిపించింది. 29 పరుగులకే 5 వికెట్లు పడిపోయాయి. త్రిస్టాన్ స్టబ్స్ (41 పరుగులు*), ఆశుతోష్ శర్మ (41 పరుగులు) బాగా ఆడటం వల్ల కొంచెం మెరుగైన స్కోరు వచ్చింది. 

56

ఢిల్లీ బ్యాటర్లలో కర్ణ్ నాయర్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరాడు. ఫాఫ్ డుప్లేసిస్ 3 పరుగులు, అభిషేక్ పొరేల్ 8 పరుగులు, కేఎల్ రాహుల్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ 6 పరుగులు, విప్రజ్ నిగమ్ 18 పరుగులు చేశారు. ఢిల్లీ హైద‌రాబాద్ టీమ్ ముందు 134 ప‌రుగుల టార్గెట్ ను ఉంచింది. 

66

వ‌ర్షంతో మ్యాచ్ ర‌ద్దు 

ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసిన త‌ర్వాత భారీ వ‌ర్షం కురిసింది. దీంతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఇన్నింగ్స్ ఆల‌స్యం అయింది. వ‌ర్షం ఆగ‌కుండా దంచికొట్ట‌డంతో మ్యాచ్ ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు అంపైర్లు ప్ర‌క‌టించారు. దీంతో రెండు జ‌ట్ల‌కు ఒక్కో పాయింట్ ల‌భించింది. మ్యాచ్ ర‌ద్దుతో హైద‌రాబాద్ టీమ్ ఐపీఎల్ టైటిట్ రేసు నుంచి అవుట్ అయింది.  

Read more Photos on
click me!

Recommended Stories