ద్రావిడ్ కాదు, ఇప్పుడు టీమిండియాకి అలాంటోడు కావాలి! టీ20ల్లో జాగ్రత్తగా ఆడితే కప్పులు రావు...

First Published Nov 16, 2022, 4:31 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా బరిలో దిగింది భారత జట్టు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా కారణంగా సెమీ ఫైనల్ చేరగలిగింది. అయితే ఓపెనర్లు, బౌలర్ల ఫెయిల్యూర్ కారణంగా సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది... పవర్ ప్లేలో టీమిండియా బ్యాటింగ్ సాగిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి, వస్తున్నాయి...

Image credit: PTI

ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పవర్ ప్లేలో కేవలం 38 పరుగులే చేయగలిగింది భారత జట్టు... కెఎల్ రాహుల్ త్వరగా అవుట్ కావడం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో పవర్ ప్లేలో రావాల్సినన్ని పరుగులు చేయలేకపోయింది భారత జట్టు. ఇదే సమయంలో ఇంగ్లాండ్ జట్టు, పవర్ ప్లేలో 68 పరుగులు రాబట్టింది...

Image credit: Getty

‘టీమిండియా దగ్గర సత్తా ఉన్న కుర్రాళ్లు చాలామంది ఉన్నారు. పేపర్ మీద వాళ్లు చాలా స్ట్రాంగ్ టీమ్. రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా గాయపడిన తర్వాత కూడా టీమిండియా నాకౌట్ స్టేజీ దాకా రాగలిగింది. అయితే టైటిల్ గెలవాలంటే ప్లేయర్లు కాదు, ఆడే విధానం మారాలి...

రవిశాస్త్రితో కూడా ఈ విషయం గురించి మాట్లాడా.. చాలామంది భారత ప్లేయర్లు, సెటిల్ అవ్వడానికి టైమ్ తీసుకుంటున్నారు. వన్డే, టెస్టుల్లో సమయం తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. అయితే టీ20ల్లో అంత సమయం ఉండదు...

రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ దీన్ని మార్చాలి. ద్వైపాక్షిక సిరీసుల్లో బాగానే ఆడతారు, కానీ ఐసీసీ టోర్నీల విషయానికి వచ్చేసరికి అతి జాగ్రత్తగా ఆడతారు. సూర్యకుమార్ యాదవ్ కూడా అంతే. ట్రెంట్ బ్రిడ్జీలో జరిగిన మ్యాచ్‌లో సూర్య 55 బంతుల్లో 115 పరుగులు చేశాడు...
 

అయితే సెమీ ఫైనల్‌లో అతను త్వరగా అవుటైపోయాడు. గెలిచినప్పుడు ఎన్ని ప్రశంసలు వస్తాయో, ఓడిపోనప్పుడు అంతకురెట్టింపు సంఖ్యలో విమర్శలు కూడా వస్తాయి. 10 ఓవర్లు ముగిసిన తర్వాత 66 పరుగులు మాత్రమే చేయగలిగినప్పుడు, విమర్శలు వస్తాయి...

Suryakumar Yadav

ఇందులో ప్లేయర్ల తప్పు లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఎలా ఆడగలరో అందరికీ తెలుసు. మారాల్సింది మైండ్‌సెట్... ఇయాన్ మోర్గాన్‌లా కేర్ ఫ్రీ క్రికెట్ ఆడే ప్లేయర్లు కావాలి. 20 ఓవర్లలో  ఎంత కొట్టగలరో అంతా కొట్టాలి... 

Image credit: PTI

ఐపీఎల్‌లో ఎలా ఆడతారో అలాగే... దేశం కోసం ఆడాలి. జనాల గోలలు పట్టించుకోకుండా కొట్టండి.. 120 బంతులు వస్తున్నప్పుడు ఎంత ఎక్కువ కొట్టగలమనేది చూడాలి. ద్రావిడ్‌లా సహనం, ఓపిక, సమయం చూస్తూ కూర్చుంటే పని కాదు...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్...
 

click me!