బాబర్ కెప్టెన్సీపై పాక్ మాజీ సారథి ఘాటు వ్యాఖ్యలు.. బాబర్ భయపడ్డాడని..

First Published Nov 16, 2022, 4:45 PM IST

T20 World Cup 2022: ఇటీవలే ముగిసిన  టీ20 ప్రపంచకప్ లో అదృష్టం కొద్దీ ఫైనల్ చేరినా చివరి మెట్టు మీద బోల్తాకొట్టింది. ఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తయ్యి ఉత్త చేతులతో తిరిగి వెళ్లింది. 

పొట్టి ప్రపంచకప్ లో అసలు  సెమీస్ ఆశలే లేని స్థితి  నుంచి అదృష్టం కొద్దీ సెమీఫైనల్స్ తో పాటు ఫైనల్స్ కూ వెళ్లిన  పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్  తో ముగిసిన ఫైనల్లో దారుణంగా విఫలమైంది. ఫైనల్లో ఇంగ్లాండ్.. పాకిస్తాన్  బ్యాటింగ్ ను దెబ్బతీసి ఈజీ విక్టరీ కొట్టింది. 

అయితే ఈ ఓటమితో పాకిస్తాన్ అభిమానులే కాదు ఆ జట్టు మాజీలు కూడా పాక్ సారథి బాబర్ ఆజమ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బాబర్  కెప్టెన్సీ వల్లే పాకిస్తాన్  ప్రపంచకప్ ఫైనల్ ముంగిట బోల్తా కొట్టిందని విమర్శలు గుప్పిస్తున్నారు. 
 

తాజాగా  పాక్ మాజీ సారథి సల్మాన్ భట్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా  ఇంగ్లాండ్ ఛేదనలో షాహీన్ అఫ్రిదితో ఐదో ఓవర్ వేయించకపోవడం,   అతడు గాయపడ్డప్పుడు బంతిని ఇఫ్తికార్ అహ్మద్ చేతికి ఇవ్వడంపై భట్ మండిపడ్డాడు. 

తన యూట్యూబ్ ఛానెల్ లో భట్ మాట్లాడుతూ.. ‘షాహీన్ అఫ్రిది అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అప్పటికే ఒక వికెట్ కూడా తీసి ఉన్నాడు. అటువంటి  బౌలర్ కు ఐదో ఓవర్ వేసే అవకాశం ఎందుకివ్వలేదు.  బంతి కూడా అప్పుడు స్వింగ్ అవుతుంది. షాహీన్ ను కాదని నసీమ్ షా  చేతికి బంతినిచ్చాడు బాబర్.  ఆ తర్వాత ఇంగ్లాండ్ ఒత్తిడిని అధిగమించింది.  షాదాబ్ ఖాన్  స్పిన్ ఉచ్చులో పడకుండా ఇంగ్లాండ్, బెన్ స్టోక్స్ ఆత్మరక్షణ  గా ఆడి లక్కీగా తప్పించుకుంది. 

కానీ చివర్లో షాహీన్ బౌలింగ్ కు వచ్చినప్పుడు ఒక బంతి వేసి అతడు గాయపడ్డాడు.  అప్పుడు బాబర్ బంతిని మహ్మద్ నవాజ్ కు ఇవ్వకుండా  ఇఫ్తికార్ అహ్మద్ కు  ఇచ్చాడు. అదే అదునుగా భావించిన బెన్ స్టోక్స్.. అతడి బౌలింగ్ లో సిక్సర్, ఫోర్ కొట్టాడు. దాంతో ఇంగ్లాండ్ విజయం తేలికైంది. అసలు బాబర్.. బంతిని నవాజ్ కు కాకుండా ఇఫ్తికార్ కు ఎందుకిచ్చినట్టు..?  

నవాజ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో రైట్ హ్యాండర్స్ కు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేయడానికే పనికొస్తాడా..?  లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల (బెన్ స్టోక్స్ లెఫ్ట్ హ్యాండర్) కు బౌలింగ్ చేయలేడా..?  అలాంటప్పుడు పాకిస్తాన్ జట్టు ప్రతీ బౌలర్ కు కింద డిస్క్రిప్షన్ లో అతడు ఎవరికి బౌలింగ్ చేస్తాడు...? ఎలా చేస్తాడు..? అని రాస్తే మంచిదేమో.   సొంత జట్టులోనే వాళ్లు ఆటగాళ్లకు పరిమితులు విధిస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్ లో  పాకిస్తాన్ వ్యూహాలు తగినంతగా లేవు. ఇక బాబర్ కొంత అయినా ధైర్యం చూపిస్తే బావుండేదేమో..’అని  అన్నాడు. 

click me!