వాళ్లు చేసిన పనికి జడేజా ఫీల్ అయ్యాడు! టీమ్ మారాలని అనుకోవడం... - సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్..

First Published Jun 22, 2023, 1:30 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కీ, రవీంద్ర జడేజాకి మధ్య సంబంధాలు సరిగా లేవు. 2022 సీజన్ ఆరంభానికి ఒక్క రోజు ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో జడేజాకి కెప్టెన్సీ అప్పగించింది సీఎస్‌కే...
 

Image credit: PTI

మాహీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సారథిని తానేనంటూ చాలాసార్లు ప్రకటించుకున్న రవీంద్ర జడేజాకి 2022 సీజన్ ఫస్టాఫ్‌లో ఊహించని షాక్ తగిలింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన తర్వాత తొలి విజయం అందుకున్న సీఎస్‌కే, 8 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకుంది..

ఇక లాభం లేదనుకుని రవీంద్ర జడేజాని కెప్టెన్సీ నుంచి తప్పించిన చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్, మళ్లీ మహేంద్రుడికే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ పరిణామాలతో రవీంద్ర జడేజా చాలా ఫీల్ అయ్యాడు..

Latest Videos


Image credit: PTI

గాయం వంకతో ఐపీఎల్ 2022 సీజన్ మధ్యలో నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా, చెన్నై సూపర్ కింగ్స్‌కి సంబంధించిన ట్వీట్లు, కామెంట్లు అన్నీ డిలిట్ చేశాడు. సీఎస్‌కే కూడా జడేజాని అన్‌ఫాలో చేసింది..

Image credit: PTI

రవీంద్ర జడేజా, 2023 సీజన్‌లో కొత్త సీజన్‌ని ఆడడం ఖాయమనుకుంటున్న సమయంలో ధోనీ జోక్యం చేసుకోవడంతో మళ్లీ జడ్డూ సీఎస్‌కే తరుపునే ఆడాడు. అయితే ఈసారి కూడా జడ్డూకి చేదు అనుభవాలే ఎదురయ్యాయి..

Jadeja CSK

రవీంద్ర జడేజా క్రీజుకి వచ్చిన ప్రతీసారీ అతను త్వరగా అవుట్ కావాలని సీఎస్‌కే ఫ్యాన్స్ కోరుకోవడం, ‘ధోనీ... ధోనీ’ అంటూ అరవడం కనిపించింది. ఈ సంఘటనలతో విసుగు చెందిన జడ్డూ... ఫైనల్‌కి ముందు ‘కర్మ’ ట్వీట్‌ చేసి తన ఫ్రస్టేషన్ బయటపెట్టాడు.

jadeja csk

అయితే ఫైనల్‌లో ఆఖరి రెండు బంతుల్లో 6, 4 బాది సీఎస్‌కేకి ఐదో ఐపీఎల్ టైటిల్ అందించిన రవీంద్ర జడేజా, తనను గేలి చేసిన వారితోనే మన్ననలు అందుకున్నాడు. అవుట్ అవ్వాలని కోరుకున్నవాళ్లే, జడేజా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌కి జేజేలు పలికారు..

Image credit: PTI

‘జడేజా ఈ సీజన్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే బ్యాటింగ్‌కి వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే, మొయిన్ ఆలీ, అజింకా రహానే... ఇలా చాలామంది బ్యాటర్లు ఉండడంతో అతనికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు..
 

ఆఖర్లో 5-10 బంతులు మిగిలి ఉన్నప్పుడు జడ్డూ బ్యాటింగ్‌కి వచ్చేవాడు. అప్పుడు కూడా ఫ్యాన్స్, ధోనీ ధోనీ. అని అరుస్తుండడంతో చాలా ఫీలయ్యాడు. చాలాసార్లు ఆ ప్లేస్‌లో బ్యాటింగ్‌కి వెళ్లకపోవడమే బెటర్ అని అనుకున్నాడు. అందరికీ ఇలాంటి ప్రెషర్ మామూలే...’ అంటూ కామెంట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్..  

click me!