టీ20 అంటేనే ధనాధన్ క్రికెట్... తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించిన జట్టుదే ఈ ఫార్మాట్ లో విజయం. అందుకే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ లాంటి ఇండియన్ హిట్టర్లు టీ20 క్రికెట్లో అద్భుతాలు చేస్తున్నారు... తాజాగా ఈ ఇద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇవాళ (అక్టోబర్ 27, మంగళవారం) ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20 లో టీమిండియా అద్భుత విజయం సాధించింది... ఓపెనర్ అభిషేక్ సెంచరీతో చెలరేగి ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించాడు.
కేవలం 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ అదే ఊపుతో సెంచరీ కూడా పూర్తిచేసుకున్నాడు… కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తంగా అభిషేక్ 11 సిక్సర్లు, 9 ఫోర్లతో కేవలం 38 బంతుల్లోనే 113 పరుగులు చేశాడు. అతడు 297 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు.
మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కూడా తానేం తక్కువకాదు అన్నట్లగా బౌండరీలతో విరుచుకుపడ్డాడు... కేవలం 19 బంతుల్లో 45 పరుగులు (4 సిక్సర్లు, 4 ఫోర్లు) చేశాడు. ఇలా ఓపెనర్లిద్దరు ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే పూర్తిచేసింది టీమిండియా.
అయితే అభిషేక్ శర్మ తాజా ఇన్నింగ్స్ తో మరోసారి టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డుపై చర్చ మొదలయ్యింది. ఎంత వేగంగా ఆడినా ఓ ఆటగాడి రికార్డును టీమిండియా క్రికెటర్లు బద్దలుకొట్టలేకపోతున్నారు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు? ఎన్ని బంతుల్లో అర్థశతకం బాదాడు? ఇండియన్ క్రికెటర్స్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిందెవరు? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.