గోవాకు వెళ్తున్న పృథ్వీషాను అడ్డుకున్న పోలీసులు... ఈ-పాస్ లేకుండా వెళ్తున్న యంగ్ క్రికెటర్‌కు...

Published : May 14, 2021, 04:15 PM IST

ఫామ్‌లో ఉన్నా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చోటు దక్కించుకోలేకపోయిన యంగ్ క్రికెటర్ పృథ్వీషాకి మరోసారి చుక్కెదురైంది. ఐపీఎల్ 2021సీజన్‌ మధ్యలోనే వాయిదాపడడంతో స్నేహితులతో కలిసి సరదాగా గోవా టూర్‌కి వెళ్దామనుకున్న పృథ్వీషాకి పోలీసులు షాక్ ఇచ్చాడు.

PREV
16
గోవాకు వెళ్తున్న పృథ్వీషాను అడ్డుకున్న పోలీసులు... ఈ-పాస్ లేకుండా వెళ్తున్న యంగ్ క్రికెటర్‌కు...

కోల్హాపూర్ మీదుగా గోవా వెళ్లేందుకు బయలుదేరిన పృథ్వీషా, అతని స్నేహితులను అంబోలీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలంటే ఈపాస్ తప్పనిసరి.

26

అయితే పృథ్వీషా వద్ద ఎలాంటి ఈపాస్ లేకపోవడంతో అతన్ని అక్కడే ఆపేశారు చెక్ పోస్ట్ పోలీసులు. దాంతో మొబైల్‌లో ఈపాస్ కోసం అప్లై చేసి, క్లియరెన్స్ తెచ్చుకున్నాడు పృథ్వీషా...

36

గంటన్నర తర్వాత గోవాకి వెళ్లేందుకు క్రికెటర్ పృథ్వీషా అండ్ అతని స్నేహితులకు అనుమతి లభించింది. విజయ్ హాజారే ట్రోఫీలో 4 సెంచరీలతో పాటు 800+ పరుగులు చేసిన పృథ్వీషా... లీగ్ చరిత్రలోనే ఓకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

46

ఐపీఎల్‌ 2021 సీజన్‌లోనూ మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు పృథ్వీషా. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ మావి బౌలింగ్‌లో మొదటి ఓవర్‌ల ఆరుకి ఆరు బంతులను బౌండరీ దాటించాడు పృథ్వీషా...

56

ఈ ఇన్నింగ్స్ తర్వాత పృథ్వీషాకి టెస్టు జట్టులో చోటు దక్కడం ఖాయమని భావించినా... వికెట్ల మధ్య అతని ఫుట్‌వర్క్ స్లోగా ఉందని ఆరోపించిన సెలక్టర్లు, ఈ యంగ్ ప్లేయర్‌ను టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి దూరం పెట్టారు.

66

రిషబ్ పంత్‌లాగే మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, పృథ్వీషా భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలంటే బరువు తగ్గి, ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు బీసీసీఐ అధికారులు...

click me!

Recommended Stories