లండన్ అమ్మాయి ప్రేమలో పడిన ఇండియన్ క్రికెటర్... మన్‌దీప్ సింగ్ లవ్‌స్టోరీ వింటే...

First Published Apr 23, 2021, 5:56 PM IST

భారత క్రికెటర్లు, బాలీవుడ్ హీరోయిన్లను ప్రేమించి పెళ్లాడడం చాలా కామన్. అయితే పంజాబ్ కింగ్స్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్ మాత్రం ఏకంగా ఓ లండన్ యువతి జగ్‌దీప్ జైస్వాల్‌ని ప్రేమించి పెళ్లాడాడు. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఇంగ్లీష్- ఇండియన్ జంటకు కొన్ని నెలల కిందట కొడుకు జన్మించాడు. మన్‌దీప్ సింగ్ డిఫరెండ్ ప్రేమ కథ ఎలా మొదలైందంటే...

భారతీయ మూలాలున్న జగ్‌దీప్ జైస్వాల్, 2016 సమ్మర్‌లో ఇండియా చూడడానికి వచ్చింది. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకోవడంతో పాటు తన కుటుంబ మూలాలను కనుక్కోవాలని భారతదేశంలో అడుగుపెట్టింది జగ్‌దీప్...
undefined
ఓ చుట్టాలమ్మాయి ద్వారా జగ్‌దీప్ జైస్వాల్‌కి మన్‌దీప్ సింగ్‌కి పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారి, ప్రేమకు దారి తీసి... చివరికి మూడు ముళ్ల బంధంగా బలపడింది...
undefined
‘2016లో నా హాలీడేస్‌లో మా నాన్న వాళ్ల జన్మస్థలం అయిన జలంధర్‌కి వచ్చాడు. అక్కడ నా బంధువుల అమ్మాయి మన్‌దీప్‌ని పరిచయం చేసింది. మన్‌దీప్ ఆమెకి క్లాస్‌మేట్. అప్పుడే అతను ఇండియన్ క్రికెటర్ అని, ఐపీఎల్ ప్లేయర్ అని తెలిసింది...
undefined
ఇండియన్ క్రికెటర్ అనే కుతూహలంతో అతని గురించి సోషల్ మీడియాలో తెలుసుకుని, ట్విట్టర్‌లో ఫాలో అవ్వడం మొదలెట్టాను. అతను చాలా కూల్ అండ్ కామ్. ఏ మాత్రం ఈగో ఉండదు...
undefined
తొలి చూపులోనే మన్‌దీప్ సింగ్ ప్రేమలో పడ్డానని చెప్పలేను. మేం కలిసిన ఏడాది తర్వాతే డేటింగ్ చేయడం మొదలెట్టాం. ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం...
undefined
పెళ్లికి ముందు ఎలా ఉండేవాడో, పెళ్లాయక కూడా మన్‌దీప్ అలాగే ఉన్నాడు. ఏ మాత్రం మార్పు రాలేదు. మా ఇద్దరికి మ్యూజిక్, సినిమాలు చాలా ఇష్టం. కాబట్టి మా మధ్య ఎప్పుడూ వీటి గురించి డిస్కర్షన్ వస్తూ ఉంటుంది...
undefined
ఐపీఎల్ మ్యాచుల సమయంలో జనాల మధ్య లౌడ్ మ్యూజిక్ మధ్య మ్యాచ్ చూస్తుంటే భలే మజాగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ఫన్ మిస్ అయింది...’ అంటూ చెప్పుకొచ్చింది మన్‌దీప్ సింగ్ సతీమణి జగ్‌దీప్ జైస్వాల్.
undefined
‘మా నాన్న ఇక్కడే పంజాబ్‌లో ఉండేవాళ్లు. 1970ల్లోనే లండన్‌లో సెటిల్ అయ్యారు. నేను అక్కడే పుట్టి, అక్కడే పెరిగాను. ఇక్కడి కల్చర్ తెలుసుకుందామని ఇండియాకి వచ్చాను, కానీ ఇక్కడే సెటిల్ అయిపోతానని మాత్రం అనుకోలేదు...
undefined
నేను మేకప్ ఆర్టిస్ట్‌ను. 13 ఏళ్ల నుంచి మేకప్ చేయడం నేర్చుకున్నాను... రకరకాల రంగులతో ఓ కొత్త లుక్ తీసుకురావడం నాకెంతో ఇష్టం’ అంటోంది జగ్‌దీప్ జైస్వాల్...
undefined
డిసెంబర్ 25, 2016న మన్‌దీప్ సింగ్ వివాహం జరగగా, జనవరి 16, 2021న ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది జగ్‌దీప్ జైస్వాల్. తన కొడుక్కి రాజ్‌వీర్ సింగ్ అని పేరు పెట్టారు మన్‌దీప్, జగ్‌దీప్.
undefined
పంజాబ్ కింగ్స్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్ క్యూట్ ఫ్యామిలీ ఫోటోలు... (ఇన్‌స్టాగ్రామ్)
undefined
పంజాబ్ కింగ్స్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్ క్యూట్ ఫ్యామిలీ ఫోటోలు... (ఇన్‌స్టాగ్రామ్)
undefined
పంజాబ్ కింగ్స్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్ క్యూట్ ఫ్యామిలీ ఫోటోలు... (ఇన్‌స్టాగ్రామ్)
undefined
click me!