ఇలా ఆడితే, టీమిండియాలోకి జన్మలో రాలేవు... సంజూ శాంసన్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్...

First Published Apr 23, 2021, 4:45 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో మొట్టమొదటి సెంచరీ చేసి, అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. అయితే మొదటి మ్యాచ్‌లో చూపించిన మెరుపులు, ఆ తర్వాత మూడు మ్యాచుల్లోనూ కనిపించలేదు. ఎప్పటిలాగే మళ్లీ ఓ మ్యాచ్ ఆడితే, మూడు మ్యాచులు ఆడడు అన్నట్టుగా సాగుతోంది కథ...

సంజూ శాంసన్ మీద ఉన్న నమ్మకంతో స్టీవ్ స్మిత్‌ను బయటికి పంపేసి, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ వంటి ప్లేయర్లు ఉన్నా... యువ క్రికెటర్‌కి కెప్టెన్సీ అప్పగించింది రాజస్థాన్ రాయల్స్. మొదటి మ్యాచ్‌లో శాంసన్ ఇన్నింగ్స్ చూసి, రాయల్స్ నిర్ణయం కరెక్టేనని అనిపించింది...
undefined
అయితే ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు సంజూ శాంసన్. వచ్చిన మొదటి బంతి నుంచే హిట్టింగ్ ఆడాలని ప్రయత్నించి అవుట్ అవుతున్నాడు ఈ యంగ్ వికెట్ కీపర్...
undefined
కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు తీసుకున్న సంజూ శాంసన్, తన ప్రదర్శనతో ముందుండి నడిపించాల్సింది పోయి, నిర్లక్ష్యపు షాట్ సెలక్షన్‌తో వికెట్ పారేసుకుంటున్నాడు. ఫలితం నాలుగింట్లో ఒకే ఒక్క విజయం...
undefined
‘సంజూ శాంసన్ చాలా టాలెంటెడ్ ప్లేయర్. అయితే ఆ టాలెంట్‌ను సరిగ్గా ఉపయోగించుకుని, నిలకడగా రాణిస్తేనే ఏ ప్లేయర్ అయినా స్టార్‌గా ఎదుగుతాడు. సంజూలో ఆ తపన, తాపత్రయం ఏ మాత్రం లేనట్టుగా ఉంది...
undefined
ఎలా అవుట్ అవ్వాలో, సంజూ శాంసన్‌కి బాగా తెలుసు. అవుట్ అవ్వడానికి కావాల్సిన మార్గాలను అతనే వెతుక్కుంటూ ఉంటాడు. బౌలర్లకు పెద్దగా కష్టపెట్టడం ఇష్టం లేని బ్యాట్స్‌మెన్ అతను...
undefined
మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ప్లేయర్, ఇలా వరుసగా మూడు మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడంటే అతని టెక్నిక్‌లో ఏదో లోపం ఉన్నట్టే. ఇప్పటికైనా సంజూ శాంసన్, తన ఆటతీరు మార్చుకోకపోతే జన్మలో టీమిండియాలో చోటు దక్కించుకోలేడు’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.
undefined
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్ మాత్రం సంజూ శాంసన్‌ ఆటపై ప్రశంసలు గుప్పించాడు. ‘సంజూ శాంసన్ ఆడుతుంటే చూడడం నాకు చాలా ఇష్టం. అతను ఆడే షాట్స్ చాలా చూడచక్కగా ఉంటాయి. అయితే అతనికి కుదరుకోవడానికి కాస్త సమయం కావాలి...
undefined
మూడు మ్యాచుల్లో ఫెయిల్ అయినంత మాత్రాన సంజూ శాంసన్‌ను విమర్శించడం సరికాదు. అతనిలో మంచి బ్యాట్స్‌మెన్, జట్టును నడిపించే నాయకుడు ఉన్నాడు....’ అంటూ కామెంట్ చేశాడు కేవిన్ పీటర్సన్...
undefined
తన బ్యాటింగ్ స్టైల్‌లో వస్తున్న విమర్శలపై కౌంటర్ అటాక్ చేశాడు సంజూ శాంసన్... ‘దయచేసి నా బ్యాటింగ్ స్టైల్ మార్చుకోమ్మని చెప్పకండి. నాకు ఇలా ఆడడమే ఇష్టం. నన్ను ఇలా వదిలేయండి’ అంటూ వ్యాఖ్యానించాడు.
undefined
click me!