ముంబై వర్సెస్ పంజాబ్ కాదు, ఇది కృనాల్ పాండ్యా వర్సెస్ దీపక్ హుడా... ఆ ఇద్దరి మధ్య రివెంజ్ డ్రామా...

First Published Apr 23, 2021, 4:08 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మధ్య పోటీ కంటే కూడా నేటి మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా, దీపక్ హుడాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుందని ఆశిస్తున్నారు అభిమానులు.

పంజాబ్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి విజయం కోసం ఎదురుచూస్తుండగా ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్‌లో ఓడి, రెండు విజయాల అనంతరం మళ్లీ ఓటమి చవిచూసింది... ఇప్పటిదాకా ముంబై నుంచి ఛాంపియన్ రేంజ్ పర్ఫామెన్స్ అయితే రాలేదు...
undefined
ముంబై ఇండియన్స్ జట్టు ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ దీపక్ హుడా మధ్య సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ సమయంలో గొడవ జరిగింది...
undefined
దేశవాళీ క్రికెట్‌లో బరోడా జట్టుకి కెప్టెన్ అయిన కృనాల్ పాండ్యా తనని అందరూ ముందు బూతులు తిట్టి అవమానించాడని, ప్రాక్టీస్ చేసేందుకు కూడా తన పర్మిషన్ తీసుకోవాలన్నట్టు ప్రవర్తించాడని ఆరోపణలు చేశాడు దీపక్ హుడా...
undefined
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ఆరంభానికి ముందు అర్ధాంతరంగా లీగ్ నుంచి తప్పుకుంటున్నట్టు బరోడా క్రికెట్ అసోసియేషన్‌కి తెలిపాడు. దీనిపై విచారణ జరిపిన బరోడా క్రికెట్ అసోసియేషన్, దీపక్ హూడాపైనే నిషేధం వేటు వేసింది...
undefined
బయో బబుల్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో బయటికి వెళ్లి వస్తానని, కెప్టెన్ చెప్పినా వినకుండా దీపక్ హూడా మొండిగా వాదించాడని... పరిస్థితి అర్థం చేసుకోకుండా ప్రవర్తించి, మళ్లీ రివర్స్‌లో కృనాల్ పాండ్యాపైనే ఆరోపణలు చేశాడంటూ తేల్చిన బరోడా క్రికెట్ అసోసియేషన్, అతను దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనకుండా ఏడాది సస్పెండ్ చేసింది.
undefined
ఈ సంఘటన కారణంగా విజయ్ హాజారే ట్రోఫీ కూడా ఆడలేకపోయిన దీపక్ హుడా... రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల, బౌండరీల మోత మోగించి మెరుపు హాఫ్ సెంచరీ నమోదుచేశాడు.
undefined
క్రిస్‌గేల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా... సిక్సర్ల వర్షం కురిపించాడు... శివమ్ దూబే వేసిన ఓవర్‌లో రెండు సిక్సర్లు, శ్రేయాస్ గోపాల్ వేసిన 14వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదిన దీపక్ హుడా 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో దీపక్ హుడా ఆడుతున్నంతసేపు కృనాల్ పాండ్యా పేరు ట్రెండింగ్‌లో కనిపించింది.
undefined
28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 64 పరుగులు చేసిన దీపక్ హుడా... పంజాబ్ కింగ్స్‌కి టూ డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ప్లేస్‌ను ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సంఘటన తర్వాత తొలిసారి ఎదురుపడబోతున్నారు దీపక్ హుడా, కృనాల్ పాండ్యా...
undefined
ఈ సీజన్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న కృనాల్ పాండ్యా, రివెంజ్ కోసం కసిగా ఎదురుచూస్తున్న దీపక్ హుడా మధ్య కచ్ఛితంగా హోరాహోరీ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు అభిమానులు.
undefined
ఇప్పటిదాకా ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచులు లో స్కోరింగ్ మ్యాచులు కావడం, రెండు మ్యాచుల్లో ప్రత్యర్థి స్వల్ప టార్గెట్‌ను చేధించడానికి కూడా కష్టపడడం కనిపించింది. దీంతో నేటి మ్యాచ్‌లో దీపక్ హుడా కారణంగానైనా ముంబై, పంజాబ్ మధ్య ఓభారీ స్కోరు మ్యాచ్ వస్తుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
undefined
click me!