ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 పాయింట్ల పట్టికలోనూ టాప్ 2లో ఉంది. అయితే విజయాల శాతం ఆధారంగా ఫైనల్ చేరే జట్లను డిసైడ్ అవుతుండడంతో ఆస్ట్రేలియాకి కూడా ప్రతీ మ్యాచ్ కీలకమే. ముఖ్యంగా వచ్చే ఏడాది ఇండియాలో జరిగే టెస్టు సిరీస్, ఆసీస్ ఫైనల్ ఛాన్సులను డిసైడ్ చేయనుంది..
ఆస్ట్రేలియాకి టీమిండియాకి టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా 102 టెస్టు మ్యాచులు జరగగా 43 టెస్టుల్లో ఆస్ట్రేలియా గెలిచింది. టీమిండియాకి 30 మ్యాచుల్లో విజయం దక్కింది... 28 టెస్టులు డ్రాగా ముగిశాయి...
29
అయితే స్వదేశంలో భారత జట్టుకి ఘనమైన రికార్డు ఉంది. భారత్‌లో ఇప్పటిదాకా 21 టెస్టుల్లో ఓడిన ఆస్ట్రేలియా, 13 టెస్టుల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఈ విజయాలు కూడా చాలా కాలం కిందట దక్కినవే...
39
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాని వరుసగా రెండు పర్యటనల్లో ఓడించింది భారత జట్టు. 2019 పర్యటనలో అద్భుత విజయం తర్వాత 2020-21 పర్యటనలోనూ గబ్బా కోటను పడగొట్టి 2-1 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా...
49
అంతకుముందు భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ ఆసీస్‌కి పరాజయమై ఎదురైంది. వరుసగా మూడు సార్లు ఆస్ట్రేలియాని ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది భారత జట్టు...
59
ఈ వరుస పరాజయాలతో ఆస్ట్రేలియాకి ఘోరమైన భంగపాటు ఎదురైంది. ఇప్పుడు భారత్ కంటే తాము మెరుగైన టీమ్ అని నిరూపించుకోవాలంటే భారత్‌లో భారత్‌ని ఓడించి టెస్టు సిరీస్ గెలవాల్సిన పరిస్థితి...
69
అదీకాకుండా శ్రీలంక పర్యటనలో రెండో టెస్టులో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా... భారత పర్యటనలో అలాంటి అనుభవం ఎదురుకాకుండా ముందుగానే జాగ్రత్త పడుతోంది. వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం 8 నెలల ముందు నుంచే ప్రిపరేషన్స్ మొదలెట్టేసింది ఆస్ట్రేలియా...
79
వచ్చే ఏడాది మార్చి 3న న్యూఢిల్లీలో తొలి టెస్టు ఆడే భారత్- ఆస్ట్రేలియా, ఆ తర్వాత మార్చి 11 నుంచి కోల్‌కత్తాలో రెండో టెస్టు, మార్చి 23న బెంగళూరులో మూడో టెస్టు, మార్చి 31న ముంబైలో నాలుగో టెస్టు ఆడతాయి...
89
భారత్‌లో స్పిన్ పిచ్‌లపై ఎలా ఆడాలో నేర్చుకునేందుకు 8 మంది ప్లేయర్లను ఇండియాకి పంపించనుంది ఆస్ట్రేలియా. చెన్నైలోని ఎమ్‌ఆర్‌ఎఫ్ అకాడమీలో శిక్షణ తీసుకోబోతున్నారు ఈ ఆసీస్ ప్లేయర్లు...
99
ఆసీస్ యంగ్ ఓపెనర్ విల్ పుకోవిస్కీతో పాటు కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ వంటి ప్లేయర్లు కూడా ఈ చెన్నై క్యాంపులో శిక్షణ తీసుకోబోతున్నారని సమాచారం. శత్రువుని ఓడించేందుకు, శత్రువు దగ్గరే పాఠాలు నేర్చుకోవాలని ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి...