కెఎల్ రాహుల్ గాయపడడం, రోహిత్ శర్మకి విశ్రాంతి ఇవ్వడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో శుబ్‌మన్ గిల్‌కి అవకాశం దక్కింది. దాదాపు మూడేళ్ల తర్వాత వన్డే టీమ్‌లోకి వచ్చిన శుబ్‌మన్ గిల్, తనకి వచ్చిన అవకాశాన్ని బాగానే వాడుకుంటున్నాడు...
తొలి వన్డేలో 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, రెండో వన్డేలో 49 బంతుల్లో 5 ఫోర్లతో 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే రెండు మ్యాచుల్లోనూ తనకి దక్కిన శుభారంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో మాత్రం గిల్ విఫలమయ్యాడు...
26
తొలి వన్డేలో వికెట్ల మధ్య నిర్లక్ష్యంగా పరుగెత్తుతూ రనౌట్ అయిన శుబ్‌మన్ గిల్, రెండో వన్డేలో కేల్ మేయర్స్ బౌలింగ్‌లో స్కూప్ షాట్‌కి ప్రయత్నించి అతనికే క్యాచ్ ఇచ్చి...అవుట్ అయ్యాడు...
36
తాజాగా పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్, శుబ్‌మన్ గిల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ‘శుబ్‌మన్ గిల్ చాలా బాగా ఆడాడు. అతనిలో చాలా టాలెంట్ ఉంది. అయితే దాన్ని సరిగ్గా వాడుకోవడమే అతనికి ఇంకా తెలియడం లేదు...
46
మంచి ఆరంభం దొరికిన తర్వాత సెంచరీ చేస్తాడని అనుకున్నా! అయితే బాగా సెటిల్ అయ్యాడని అనుకుంటున్న సమయంలో అవుట్ అయ్యాడు. వరుసగా ఇలాగే చేస్తున్నాడు...
56
మంచి స్టార్ట్ దొరికడమే కాదు, దాన్ని భారీ స్కోర్లుగా మలుచుకోవడం కూడా తెలియాలి... దానికి కాస్త సమయం పడుతుంది. అనుభవం అన్ని పాఠాలు నేర్పిస్తుంది... ’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్...
66
‘సూర్యకుమార్ యాదవ్ గత రెండు సిరీసుల్లో భారత జట్టుకి విజయాలు అందించాడు. అతని ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయినంత మాత్రం ఫామ్ కోల్పోయినట్టు కాదు...’ అంటూ కామెంట్ చేశాడు సల్మాన్ భట్..