దాంట్లో ఆడకండి, మా లీగ్ ఆడండి... ఆస్ట్రేలియా క్రికెటర్లకు అక్కడి నుంచి కోట్లల్లో ఆఫర్లు...

Published : Aug 04, 2022, 03:47 PM ISTUpdated : Aug 04, 2022, 03:50 PM IST

ఐపీఎల్ కారణంగా బీసీసీఐకి వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఒక్క ప్రసార హక్కుల విక్రయం ద్వారానే రూ.48 వేల కోట్లు ఆర్జించిన బీసీసీఐ, ఐసీసీ నుంచి రెండున్నర నెలల విండో కూడా తెచ్చుకుంది. లీగ్ క్రికెట్‌కి పెరుగుతున్న క్రేజ్‌కి ఇదో ఉదాహరణ మాత్రమే.. వచ్చే ఏడాది ప్రారంభం కాబోయే యూఏఈ టీ20 లీగ్, ఇప్పుడు మిగిలిన లీగులను దెబ్బేసే పనిలో పడిందట..

PREV
110
దాంట్లో ఆడకండి, మా లీగ్ ఆడండి... ఆస్ట్రేలియా క్రికెటర్లకు అక్కడి నుంచి కోట్లల్లో ఆఫర్లు...
Image credit: PTI

ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆధ్వర్యంలో జనవరి 2023లో యూఏఈ టీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌లోని ఫ్రాంఛైజీ యజమానులే, యూఏఈ టీ20 లీగ్‌లోనూ ఫ్రాంఛైజీలను కొనుగోలు చేశారు...

210
David Warner-Aaron Finch

యూఏఈ టీ20 లీగ్‌లో ఒక్కో టీమ్‌కి 2.5 మిలియన్ డాలర్లు (రూ.20 కోట్లు) పర్సు వాల్యూని కేటాయించారు. దీంతో స్టార్ ప్లేయర్లను 450000 డాలర్లు (దాదాపు 3.5 కోట్లు) ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి...

310
Pat Cummins - David Warner

ఐపీఎల్ కంటే ఇది తక్కువే కానీ మిగిలిన క్రికెట్ లీగులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. పొరుగుదేశం పాక్‌లో పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌లో అత్యధికంగా చెల్లించే మొత్తం రూ.1.9 కోట్లు మాత్రమే... ఐపీఎల్ తర్వాత అత్యంత పాపులారిటీ దక్కించుకున్న బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్‌)లోనూ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు.

410
Image Credit: PTI (L); SRH Instagram (R)

అయితే వరుసగా క్రికెట్ లీగులో వస్తుండడంతో షెడ్యూల్ కష్టంగా మారనుంది. ఐపీఎల్ కోసం రెండున్నర నెలలు పోగా మిగిలిన తొమ్మిదిన్నర నెలల్లో ద్వైపాక్షిక సిరీస్‌లను చూసుకుంటూ షెడ్యూల్‌ను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది...

510

లంక ప్రీమియర్ లీగ్, పాక్ సూపర్ లీగ్, కరేబియర్ ప్రీమియర్ లీగ్, ది హండ్రెడ్, బిగ్‌బాష్ లీగ్‌లతో పాటు వచ్చే ఏడాది సౌతాఫ్రికా కూడా టీ20 లీగ్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. దీంతో ఒక్క లీగ్‌లో పాల్గొనాలంటే మరోదాని నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి రానుంది...

610

దీంతో యూఏఈ లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్లు, బిగ్‌బాష్ లీగ్ ఆడకుండా అదే సమయంలో యూఏఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు 15 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లకు రూ.4 కోట్ల దాకా కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఆశచూపిస్తున్నారని సమాచారం..

710
Glenn Maxwell

రూ.4 కోట్లంటే ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ రిజర్వు ప్లేయర్‌కి ఇచ్చే మొత్తం. అయితే బీబీఎల్ ద్వారా వచ్చే దానితో పోల్చుకుంటే, ఆసీస్ క్రికెటర్లకు ఇది చాలా ఎక్కువ మొత్తమే. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియాకి భయం పట్టుకుందట...

810

ఆసీస్ క్రికెటర్లు ఆ డబ్బుకి ఆశపడి యూఏఈ టీ20 లీగ్‌లో ఆడాలని నిర్ణయం తీసుకుంటే, స్టార్ ప్లేయర్లు లేకుండా బీబీఎల్‌ని నిర్వహించాల్సి ఉంటుంది. మిగిలిన దేశాల ప్లేయర్లు కూడా యూఏఈ టీ20 లీగ్‌ ఆడేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తే బీబీఎల్‌ నిర్వహణే కష్టమైపోతుంది...

910

దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోందట ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. బీసీసీఐ మాదిరిగానే తమ ప్లేయర్లు, విదేశీ టీ20ల్లో లీగుల్లో పాల్గొనకుండా నియంత్రించాలనే ఆలోచనలో కూడా సమాచారం..  

1010

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి యూఏఈ నుంచి 7 లక్షల డాలర్లు (దాదాపు 5.5 కోట్లు) ఆఫర్ వచ్చిందని, అలాగే ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కి కూడా దాదాపు రూ.6 లక్షల డాలర్లకు పైగా ఆఫర్ వచ్చందని... ఈ ఇద్దరూ యూఏఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియాని అనుమతి కోరినట్టు వార్తలు వస్తున్నాయి. 

click me!

Recommended Stories