భారత జట్టుతో పోలిస్తే పాక్ చాలా వీక్ టీమ్! చాలా కష్టపడాల్సి ఉంటుంది.. - వకార్ యూనిస్

First Published | Sep 29, 2023, 4:55 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీకి ముందు వరకూ టీమిండియా, పాకిస్తాన్ చేతుల్లో ఈజీగా ఓడిపోతుందని కామెంట్లు చేస్తూ వచ్చారు పాక్ మాజీ క్రికెటర్లు. పాక్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ముందు భారత బ్యాటర్లు నిలవలేరని అన్నారు. ఇప్పుడు వారంతా తోక ముడుస్తున్నారు..
 

India vs Pakistan

ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత జట్టు 228 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు చేస్తే, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సెంచరీలు చేశారు..

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ పూర్తిగా తేలిపోయింది. 5 ఓవర్లు బౌలింగ్ చేసిన హారీస్ రౌఫ్ గాయంతో మిగిలిన 5 ఓవర్లు వేయనేలేదు. 9.2 ఓవర్లు బౌలింగ్ చేసిన నసీం షా, గాయంతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు..
 

Latest Videos


‘వరల్డ్ కప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అతి పెద్దది. ఈ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నా ఉద్దేశంలో ఇది మిగిలిన మ్యాచ్‌లకు అమ్మమొగుడు లాంటిది..
 

అయితే అహ్మదాబాద్‌లో ఆడుతున్నప్పుడు పాకిస్తాన్ జట్టు, చాలా జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాలి. టీమిండియా కంటే పాకిస్తాన్ వీక్ టీమ్. కాబట్టి ఆచి తూచి ఆడితేనే గెలిచే ఛాన్స్ ఉంటుంది..
 

పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉన్నా, టీమిండియా కూడా ప్రెషర్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లక్షమంది జనం ముందు మ్యాచ్ ఆడడం అంటే మామూలు విషయం కాదు. వారి అరుపులు, గోలలు ప్లేయర్లను తీవ్ర ఒత్తిడిలో పడేస్తాయి..
 

నసీం షా లేకపోవడం పాకిస్తాన్‌కి చాలా పెద్ద దెబ్బ. షాహీన్ ఆఫ్రిదీ, నసీం షా ఇద్దరూ తొలి ఓవర్లలో వికెట్లు తీసేవారు. హసన్ ఆలీ వచ్చినా, అతని అనుభవం టీమ్‌కి ఎంతగా ఉపయోగపడుతుందో చెప్పలేం...

ఇన్ని రోజులు టీమ్‌కి దూరంగా ఉండి, సడెన్‌గా వచ్చి ఆడమంటే టీమ్‌లో కుదురుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఇప్పుడు పరిస్థితుల్లో నాకైతే భారత జట్టు, టాప్ క్లాస్ టీమ్‌గా కనబడుతోంది...
 

Kuldeep Yadav

రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ కూడా టీమిండియాకి మ్యాచ్ విన్నర్లు. స్పిన్‌కి అనుకూలించే పిచ్‌లపై వికెట్లు ఎలా తీయాలో వీళ్లకు బాగా తెలిసిన విద్య.. ’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్.. 

click me!