తాజాగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు అక్షర్ పటేల్ గాయంతో టీమ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ 2023 టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు అక్షర్ పటేల్..
Axar Patel-Ashwin
ఈ గాయం కారణంగానే ఫైనల్ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌కి చోటు దక్కలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఆడలేకపోయాడు అక్షర్. అక్షర్ పటేల్ సమయానికి కోలుకోకపోవడంతో అతన్ని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ నుంచి తప్పించి, అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌కి ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ..
అయితే ఈ రిప్లేస్‌మెంట్ ప్రకటన వచ్చిన తర్వాత అక్షర్ పటేల్ చేసిన పోస్ట్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
‘కామర్స్ బదులుగా సైన్స్ చదివి ఉంటే బాగుండేది. ఇంకా ఓ మంచి పీఆర్‌ని పెట్టుకుని ఉంటే బాగుండేది..’ అంటూ గుండె పగిలిన ఎమోజీని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్‌గా పెట్టాడు అక్షర్ పటేల్. కొద్దిసేపటికే ఈ స్టోరీని డిలీట్ చేశాడు. అయితే అప్పటికే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అయిపోయింది..
అక్షర్ పటేల్ పోస్ట్ చూస్తుంటే, తాను గాయం నుంచి కోలుకున్నా.. కావాలనే అతన్నే వరల్డ్ కప్ నుంచి తప్పించారని ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తోంది. మంచి పీఆర్ ఉండడం వల్లే రవిచంద్రన్ అశ్విన్‌కి వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం దక్కిందని కూడా ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్ చేస్తున్నట్టు ఉంది..
ఈ పోస్ట్ అతని కెరీర్‌పై తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇంతకుముందు ఇలా టీమిండియా మేనేజ్‌మెంట్‌ని, సెలక్టర్లను ప్రశ్నించిన అంబటి రాయుడు, వృద్ధిమాన్ సాహా.. టీమ్‌లో ఎక్కువ కాలం నిలవలేకపోయారు.
Image credit: PTI
అక్షర్ పటేల్ ఆవేదనలో అర్థం ఉంది. ఎందుకంటే అతను ఇలా వన్డే వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ కోల్పోవడం ఇది మూడో సారి.
Image credit: PTI
2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఎంపికైన రిజర్వు బెంచ్‌లోనే కూర్చున్న అక్షర్ పటేల్, 2019 వరల్డ్ కప్‌కి ఎంపిక కాలేదు. 2023 వరల్డ్ కప్‌కి ఎంపికైనా గాయం వంకతో మళ్లీ జట్టులో చోటు కోల్పోయాడు అక్షర్ పటేల్..