రాహుల్ ద్రావిడ్ అంటే టీమ్ మొత్తానికి భయం, ఆయన్ని చూస్తే చాలు... పృథ్వీషా కామెంట్...

First Published May 26, 2021, 10:00 AM IST

రాహుల్ ద్రావిడ్... మోస్ట్ లవబుల్ భారత క్రికెటర్. ‘ది వాల్’గా పేరొందిన టెస్టు క్లాస్ ప్లేయర్, రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. సీనియర్ జట్టుకి కోచ్‌గా వ్యవహారించకపోయినా జూనియర్స్‌ను స్టార్స్‌గా మలిచాడు రాహుల్ ద్రావిడ్. 

భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు ఆయన సహాయక బృందం విరాట్ కోహ్లీతో కలిసి ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్తుండడంతో శ్రీలంకలో పర్యటించే జట్టుకి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ వ్యవహారించబోతున్నాడు. దీంతో ఈ జట్టులో తప్పక చోటు దక్కించుకుంటాడని టాక్ నడుస్తున్న పృథ్వీషా, రాహుల్ ద్రావిడ్ కోచింగ్ స్టైల్ గురించి మాట్లాడాడు.
undefined
‘రాహుల్ ద్రావిడ్ సర్ చాలా కూల్ అండ్ కామ్. కానీ ఆయనంటే జట్టులో అందరికీ భయం. 2018లో అండర్19 వరల్డ్‌కప్‌కి ముందు యువ ఆటగాళ్లతో కలిసి విదేశీ టూర్‌కి వెళ్లాం...
undefined
కీలక టోర్నీకి ముందు మాకు కావాల్సినంత రిలాక్స్, ప్రాక్టీస్ దొరకాలని ఆయన ఈ టూర్ ఏర్పాటు చేయించారు. విదేశీ పిచ్‌లపై ప్రాక్టీస్ చేయడం వల్ల టోర్నీలో పెద్దగా ఇబ్బంది పడలేదు.
undefined
కుర్రాళ్ల గురించి ఆయనకి బాగా తెలుసు. తనలా క్రమశిక్షణతో నడుచుకోవాలని ఆయనెప్పుడూ మాకు చెప్పలేదు. అలాగే ఎవరి బ్యాటింగ్ స్టైల్‌ని మార్చాలని ద్రావిడ్ సర్ ప్రయత్నించలేదు...
undefined
ఎవరి బ్యాటింగ్ స్టైల్ వారిది. అందుకే దూకుడుగా ఆడే వారికి డిఫెన్సివ్‌గా ఆడాలని ఎన్నడూ చెప్పలేదు. అలా చెప్పి ఉంటే, నా బ్యాటింగ్ మారి ఉండేదేమో. ఎప్పుడు నా స్టైల్‌లో నన్ను ఆడమని చెప్పేవారు.
undefined
ఆయన ఆటగాళ్ల సైకాలజీని ఈజీగా అర్థం చేసుకునేవారు. ఎప్పుడు ఆటకి సంబంధించిన విషయాలే మాట్లాడతారు. చాలా తక్కువగా మాట్లాడుతూ, కూల్‌గా కామ్‌గా ఉండేవారు. ఎంత క్లోజ్‌గా ఉన్న ఆయనంటే మాకు భయమే.
undefined
ఆయన నిశ్శబ్దంతోనే భయపెట్టేవారు. క్రీజులో చేసిన తప్పులే మళ్లీ చేస్తే సున్నితంగా మదలించేవారు. ఆయన హుందాతనం వల్లే ద్రావిడ్ సర్‌ను చూస్తే టీమ్ మొత్తానికి గౌరవంతో కూడిన భయం ఉండేది.
undefined
అలాగని ఆయన మరీ స్ట్రిక్ కాదు. మాతో కలిసి డిన్నర్లు చేసినా, ఎంత ఫ్రెండ్లీగా నడుచుకున్నా... ఓ లెక్చరర్‌తో స్టూడెంట్స్ నడుచుకున్నట్టుగానే భావించేవాళ్లం. ఎందుకంటే ఆయనో లెజెండ్...’ అంటూ చెప్పుకొచ్చాడు యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషా.
undefined
రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో 2018 అండర్‌19 జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించిన పృథ్వీషా... టైటిల్ గెలిచి, భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. పృథ్వీషా కెప్టెన్సీలో ఆడిన శుబ్‌మన్ గిల్ కూడా భారత జట్టులో కీ ప్లేయర్‌గా మారిన విషయం తెలిసిందే.
undefined
విజయ్ హాజారే ట్రోఫీలో 800+ పరుగులు చేసిన పృథ్వీషా, ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ అదరగొట్టాడు. అయితే ఓవర్ వెయిట్ సాకుగా చూపుతూ అతన్ని ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపిక చేయలేదు బీసీసీఐ సెలక్టర్లు.
undefined
శ్రీలంక టూర్‌కి ఎంపిక చేసే జట్టులో పృథ్వీషాతో పాటు శిఖర్ ధావన్, నటరాజన్, హార్ధిక్ పాండ్యా, దీపక్ చాహార్, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ వంటి ప్లేయర్లు చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
undefined
click me!