రికార్డులు పేల్చనున్న ఐపీఎల్ 2023 మినీ వేలం... రూ.20 కోట్లు పెట్టేందుకు సిద్ధమవుతున్న ఫ్రాంఛైజీలు..

First Published Dec 22, 2022, 4:56 PM IST

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం అందుకున్న ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్. ఆర్‌సీబీ తరుపున విరాట్ కోహ్లీ రూ.17 కోట్లు తీసుకుంటే, లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా కెఎల్ రాహుల్ రూ.17 కోట్లు తీసుకుంటున్నాడు. అయితే ఈ సారి ఈ మార్కు రూ.20 కోట్లను తాకుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు..

ఐపీఎల్ 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధికంగా రూ.42.25 కోట్లతో ఈ వేలంలో పాల్గొంటోంది.. ఏ ప్లేయర్‌కోసమైనా రూ.20 కోట్లు పెట్టాలంటే అది సన్‌రైజర్స్ హైదరాబాద్ వల్లే అవుతుంది.


గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియంసన్‌ని వేలానికి విడుదల చేసింది సన్‌రైజర్స్. దాంతో ఇప్పుడు ఎస్‌ఆర్‌హెచ్‌కి కెప్టెన్ కావాలి. కెప్టెన్ కోసం ఆరెంజ్ ఆర్మీ రూ.20 కోట్లు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం...

బెన్ స్టోక్స్‌తో పాటు మయాంక్ అగర్వాల్, కామెరూన్ గ్రీన్, రిలే రూసో, సికందర్ రజా వంటి స్టార్లు వేలంలో ఉన్నారు. వీరితో పాటు గత సీజన్లలో సీఎస్‌కేకి ఆడిన నారాయణ్ జగదీశన్ కూడా దేశవాళీ టోర్నీల్లో రికార్డులు క్రియేట్ చేశాడు...

Narayan Jagadeesan

పంజాబ్ కింగ్స్ దగ్గర రూ.32.2 కోట్లు ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ రూ.23.35 కోట్లతో వేలంలో పాల్గొంటోంది. ముంబై ఇండియన్స్ రూ.20.55 కోట్లతో బరిలో దిగుతుంటే చెన్నై సూపర్ కింగ్స్ పర్సులో రూ.20.45 కోట్లు ఉన్నాయి.. ఈ జట్లు ఒక్కో ప్లేయర్ల కోసం రూ.20 కోట్లు పెట్టే సాహసం చేయకపోవచ్చు.. చేయవు కూడా! 

ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా క్రిస్ మోరిస్‌కి రికార్డు ఉంది. ఈసారి ఆ రికార్డును సామ్ కుర్రాన్, బెన్ స్టోక్స్ వంటి ప్లేయర్లు ఈజీగా బ్రేక్ చేసే అవకాశం ఉంది. లక్ బాగా కలిసి వచ్చి సుడి తిరిగితే మయాంక్ అగర్వాల్, కేన్ విలియంసన్, జగదీశన్, మనీశ్ పాండే లాంటి ప్లేయర్లు కూడా భారీ ధర దక్కించుకోవచ్చు...

click me!