Champions Trophy: ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. మినీ వరల్గ్ కప్ గా గుర్తింపు పొందిన ఈ ఐసీసీ టోర్నీలో ధనాధన్ ఇన్నింగ్స్ లతో పాటు సూపర్ బౌలింగ్ తో అదరగొట్టడానికి ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ప్లేయర్లు ఎవరో తెలుసా?
వెస్టిండీస్ మాజీ లెజెండ్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. అతను 17 ఇన్నింగ్స్ లలో 791 పరుగులు చేయగా, అందులో 3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉంది.
2. మహేల జయవర్ధనే
శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా ఉన్నాడు. అతను 22 మ్యాచ్ లలో 742 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
25
3. శిఖర్ ధావన్
భారత జట్టు మాజీ ఓపెనర్ గబ్బర్ శిఖర్ ధావన్ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. కేవలం 10 మ్యాచ్ లలోనే 77.88 సగటుతో 701 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
4. కుమార సంగక్కర
శ్రీలంక మాజీ లెజెండ్ కుమార సంగక్కర ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన 4వ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అతను 22 మ్యాచ్ లలో 683 పరుగులు చేశాడు. అందులో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
35
5. సౌరవ్ గంగూలీ
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 13 మ్యాచ్ లను ఆడి 665 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
6. జాక్వెస్ కాలిస్
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లిస్ 17 మ్యాచ్ లను ఆడి 653 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
45
Image Credit: Twitter/Sarang Bhalerao
7. రాహుల్ ద్రవిడ్
భారత మాజీ కెప్టెన్, 'ది వాల్' అని కూడా పిలువబడే రాహుల్ ద్రవిడ్ ఛాంపియన్స్ ట్రోఫీలో 18 మ్యాచ్ లను ఆడి 627 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
8. రికీ పాంటింగ్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ రికీ పాంటింగ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 18 మ్యాచ్ లను ఆడి 593 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు.
55
Cricketer virat
9. శివనారాయణ్ చంద్రపాల్
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మన్ శివనారాయణ్ చంద్రపాల్ 16 మ్యాచ్ లను ఆడి 587 పరుగులు చేశాడు. అతను ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు.
10. సనత్ జయసూర్య
శ్రీలంక మాజీ బ్యాట్స్‌మన్ సనత్ జయసూర్య ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో 536 పరుగులు చేశాడు.
11. విరాట్ కోహ్లీ
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో 529 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు.