WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు, వికెట్లు, సిక్సర్లు సాధించిన ప్లేయ‌ర్లు వీరే

Published : Feb 14, 2025, 02:57 PM IST

WPL 2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2025 ఎడిషన్ ఫిబ్రవరి 14న ప్రారంభం కానుంది. అయితే, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు, అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు ఎవరో మీకు తెలుసా?

PREV
15
WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు, వికెట్లు, సిక్సర్లు సాధించిన ప్లేయ‌ర్లు వీరే
WPL 2025, WPL , Women's Premier League,

WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 మూడో ఎడిషన్ శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 14న‌) ఘ‌నంగా ప్రారంభం కానుంది. WPL 2025 ఫిబ్రవరి 14 నుండి మార్చి 15 వరకు జరుగుతుంది. ఈ మ్యాచ్ లు 4 భారతీయ నగరాల్లో జ‌రుగుతాయి. 5 జట్లు పోటీ పడనున్నాయి. మహిళల ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జెయింట్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఉన్నాయి. 

25
Image Credit: Twitter/WPL

డ‌బ్ల్యూపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ జెయింట్స్ (GG) త‌ల‌ప‌డ‌నున్నాయి. రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్పోర్ట్స్18 నెట్‌వర్క్, జియో సినిమా యాప్ & వెబ్‌సైట్ లో లైవ్ చూడ‌వ‌చ్చు. అయితే, మహిళల ప్రీమియర్ లీగ్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు, అత్య‌ధిక వికెట్లు, అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ల వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

35
WPL 2025

మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్లు 

మెగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిట‌ల్స్) – 18 మ్యాచ్‌లలో 676 పరుగులు

ఎల్లీస్ పెర్రీ (ఆర్సీబీ) – 17 మ్యాచ్‌ల్లో 600 పరుగులు

షఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిట‌ల్స్) – 18 మ్యాచ్‌ల్లో 561 పరుగులు

హర్మన్‌ప్రీత్ కౌర్ (ముంబై ఇండియ‌న్స్) – 17 మ్యాచ్‌ల్లో 549 పరుగులు

నాట్ స్కైవర్-బ్రంట్ (ముంబై ఇండియ‌న్స్) – 19 మ్యాచ్‌లలో 504 పరుగులు

45

మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయ‌ర్లు

షఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిట‌ల్స్) – 18 మ్యాచ్‌ల్లో 33 సిక్సులు

సోఫీ డివైన్ (ఆర్సీబీ) - 18 మ్యాచ్‌ల్లో 20 సిక్సులు

రిచా ఘోష్ (ఆర్సీబీ) – 18 మ్యాచ్‌ల్లో 17 సిక్సులు

గ్రేస్ హారిస్ (యూపీ వారియ‌ర్స్) – 14 మ్యాచ్‌లలో 16 సిక్సులు

ఆలిస్ కాప్సే (ఢిల్లీ క్యాపిట‌ల్స్) – 17 మ్యాచ్‌లలో 16 సిక్సులు

55

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయ‌ర్లు

సోఫీ ఎక్లెస్టోన్ (యూపీ వారియ‌ర్స్) – 17 మ్యాచ్‌లలో 27 వికెట్లు

సైకా ఇషాక్ (ముంబై ఇండియ‌న్స్) – 19 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు

హేలీ మాథ్యూస్ (ముంబై ఇండియ‌న్స్) – 19 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు

అమేలియా కెర్ (ముంబై ఇండియ‌న్స్) – 19 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు

మారిజాన్ కాప్ (ఢిల్లీ క్యాపిట‌ల్స్) – 16 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు

Read more Photos on
click me!

Recommended Stories