వాడో చీఫ్ సెలక్టర్, ఇదో చీప్ సెలక్షన్... టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌పై పాక్ మాజీల కామెంట్స్...

Published : Sep 16, 2022, 12:34 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన పాక్ జట్టుపై ఆ దేశ మాజీలు పెదవి విరుస్తున్నారు. గత ఏడాది వరల్డ్ కప్‌కి ముందు పాక్ టీమ్ సెలక్షన్‌పై విమర్శలు వచ్చినట్టుగానే ఈసారి కూడా ట్రోల్స్ అప్పుడే మొదలైపోయాయి. టీమ్ సెలక్షన్ సరిగా లేదని, ఈ టీమ్‌తో టైటిల్ గెలవడం అసాధ్యమేనంటూ కామెంట్లు చేస్తున్నారు పాక్ మాజీ క్రికెటర్లు.

PREV
16
వాడో చీఫ్ సెలక్టర్, ఇదో చీప్ సెలక్షన్... టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌పై పాక్ మాజీల కామెంట్స్...
shaheen

గాయం నుంచి కోలుకున్న స్టార్ బౌలర్ షాహిదీ ఆఫ్రిదీని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన సెలక్టర్లు, సీనియర్ బ్యాటర్ ఫకార్ జమాన్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు. సీనియర్ బ్యాటర్ షోయబ్ మాలిక్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌లో చోటు దక్కలేదు...

26

‘వరస్ట్ చీఫ్ సెలక్టర్... ఘోరమైన సెలక్షన్... రిజల్ట్ కూడా దారుణంగా ఉంటుంది..’ అంటూ ఓ పాక్ జర్నలిస్ట్ చేసిన పోస్టుని రీట్వీట్ చేసిన పాక్ మాజీ బౌలర్ మహ్మద్ ఆమీర్, ‘చీఫ్ సెలక్టర్ కి చీప్ సెలక్షన్...’ అంటూ ట్వీట్ చేసింది...

36
Shoaib Akhtar

పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా పాక్ టీమ్ సెలక్షన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘పాక్ క్రికెట్ బోర్డు ఎలాంటి టీమ్‌ని సెలక్ట్ చేసింది. మిడిల్ ఆర్డర్‌లో సరిగ్గా రాణించే ప్లేయర్లు లేరు. మీకు నచ్చిన ప్లేయర్లను తీసుకొచ్చి టీమ్‌లో వేశారు, మరి మా సంగతేంటి?

46
Fakhar Zaman

ఈసారి అయినా మిడిల్ ఆర్డర్‌లో మార్పులు చేస్తారని అనుకున్నాం. ఫకార్ జమాన్‌కి అవకాశం ఇవ్వాలని నేను లక్షల సార్లు చెప్పాను. అతను మిడిల్ ఆర్డర్‌లో ఆరు ఓవర్లు సరిగ్గా వాడుకోగలడు. బాబర్ ఆజమ్‌ని ఓపెనర్‌గానే ఉంచి, ఫకార్ జమాన్‌ని మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే బాగుండేది..

56

ఈ ఫార్మాట్‌లో కెప్టెన్ సరిగ్గా సూట్ అవ్వడం లేదు. అతను బాడీకి దగ్గరగా ఆడుతూ తన మార్క్ క్లాసిక్ కవర్ డ్రైవ్స్ ఆడాలని అనుకుంటున్నాడు. క్లాస్ ఆట ఆడాలనుకుంటే టీ20ల్లో పెద్దగా రాణించలేరు... ఆ విషయం బాబర్ ఆజమ్‌కి ఎప్పటికి తెలిసి వస్తుందో...

66
Shoaib Akhtar

పాక్ సెలక్టర్ల యావరేజ్‌గా ఉన్నప్పుడు, టీమ్ కూడా యావరేజ్‌గానే ఉంటుంది. ఇలాంటి టీమ్‌తోనే పెద్ద పెద్ద విజయాలు ఆశించడం కష్టమే...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్..

click me!

Recommended Stories