అక్కడ కూడా అట్టర్ ఫ్లాప్... పూజారా డకౌట్, సెంచరీ చేసిన హనుమ విహారి, షారుక్ ఖాన్..

Published : Feb 19, 2022, 03:38 PM IST

దాదాపు మూడేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నాడు భారత సీనియర్ టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా. సౌతాఫ్రికా టూర్‌లో ఘోరంగా విఫలమైన పూజారా, శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కి ఎంపిక కావడం అనుమానమే...

PREV
111
అక్కడ కూడా అట్టర్ ఫ్లాప్... పూజారా డకౌట్, సెంచరీ చేసిన హనుమ విహారి, షారుక్ ఖాన్..

గత ఏడాదిగా ఘోరంగా విఫలమవుతూ వస్తున్న ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానేలను ఫామ్‌ని తిరిగి అందిపుచ్చుకోవడానికి రంజీ ట్రోఫీలో ఆడాల్సిందిగా సూచించింది బీసీసీఐ...

211

ముంబై తరుపున ఆడుతున్న అజింకా రహానే, తొలి మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. దాదాపు కమ్‌బ్యాక్ కన్ఫార్మ్ చేసుకున్నాడు...

311

అయితే ఛతేశ్వర్ పూజారా మాత్రం రంజీ ట్రోఫీలో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసి డిక్లేర్ చేసింది ముంబై జట్టు...

411

అజింకా రహానే 129 పరుగులు చేయగా సర్ఫరాజ్ ఖాన్ 275 పరుగులు చేశాడు. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

511

ఛతేశ్వర్ పూజారా 4 బంతులాడి పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు. షెల్డన్ జాక్సన్ 88 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులు చేయగా చిరాగ్ జానీ 40 పరుగులు చేశాడు..

611

మరో భారత టెస్టు ప్లేయర్ హనుమ విహారి, ఛంఢీఘర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 149 బంతుల్లో 15 ఫోర్లతో 106 పరుగులు చేసి అవుట్ అయ్యాడు హైదరాబాద్ ప్లేయర్ విహారి..

711

ఐపీఎల్‌ వేలంలో భారీ ధర దక్కించుకున్న తిలక్ వర్మ 76 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ 49 పరుగులు చేశాడు.

811

హైదరాబాద్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌ఘడ్ 216 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మనన్ వోహ్రా 110 పరుగులు చేసి రాణించాడు...

911

తమిళనాడు, ఢిల్లీ మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో యంగ్ సెన్సేషన్ షారుక్ ఖాన్ సెంచరీతో చెలరేగాడు. 125 బంతుల్లో 18 ఫోర్లు, 8 సిక్సర్లతో 162 పరుగులు చేసిన షారుక్, మొదటి ఫస్ట్ క్లాస్ సెంచరీ అందుకున్నాడు...

1011

బాబా అపరాజిత్ 117 పరుగులు చేసి అవుట్ కాగా విజయ్ శంకర్ 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 452 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

1111

అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ 113 పరుగులు చేసి, తొలి మ్యాచ్‌లో సెంచరీతో ఇంప్రెస్ చేయగా లలిత్ యాదవ్ 177 పరుగులు చేశాడు...
 

click me!

Recommended Stories