టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనికి క్రికెట్ తో పాటు ఇతర ఆటల మీద కూడా ఆసక్తి అనే విషయం అందరికీ తెలిసిందే. క్రికెటర్ కాకముందు ధోని ఫుట్బాల్ కూడా ఆడేవాడు.
26
రేసింగ్ గేమ్స్ ను కూడా ధోని అమితంగా ఇష్టపడతాడు. ప్రస్తుతం టీమిండియాలో ఏ ఆటగాడి దగ్గర లేనన్ని రేసింగ్ కార్లు, బైకులు ధోని దగ్గర ఉన్నాయి.
36
అయితే వీటితో పాటు ధోనికి మరో వ్యాపకం కూడా ఉందట. టీమిండియా అభిమానులకు తెలియని ఆ వ్యాపకం పై ధోని మాజీ సహచరుడు, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
46
భజ్జీ మాట్లాడుతూ... ‘మ్యాచుల తర్వాత ధోనిని హోటల్ రూమ్ లలో చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. అతడు ఎక్కువ టైమ్ ఈస్పోర్ట్స్ (కంప్యూటర్ గేమ్స్) మీదే గడుపుతాడు. కొన్నిసార్లు ఫిఫా.. కొన్నిసార్లు పబ్ జీ, మరికొన్ని సార్లు ఇతర ఆటలు ఆడతాడు.
56
ఈస్పోర్ట్స్ అనేది చాలా పెద్ద విషయం. ధోనితో పాటు ప్రస్తుతం టీమిండియాలోని చాలా మంది క్రికెటర్లు వీటిని ఆడతారు. కొన్నిసార్లు మేం కొన్ని జట్లుగా ఏర్పడి షూటర్ వీటిని ఆడతాం. ఇక ధోని విషయానికొస్తే.. క్రికెట్ కంటే 15 రెట్లు ఎక్కువగా ఈస్పోర్ట్స్ ఆడతాడు..’ అని భజ్జీ స్పష్టం చేశాడు.
66
ఇదిలాఉండగా.. ఇప్పటికే భారత క్రికెట్ నుంచి రిటైరైన ధోని ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ కు కూడా స్వస్తి చెప్పనున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్-15 కోసం సిద్ధమవుతున్న ధోని.. ఈ సీజన్ పూర్తిగా ఆడేది కూడా డౌటే.. భారత్ కు రెండు ప్రపంచకప్పులు అందించిన ధోని.. 2020 ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.