అప్పుడు యువీలాగే రైనా కూడా ధోనీ నమ్మకాన్ని కోల్పోయాడు... మాహీ వల్లే సీఎస్‌కే ఈ పని చేసింది...

Published : Feb 19, 2022, 02:39 PM IST

క్రికెట్‌లో శత్రవులు మిత్రులవుతారు, ఆప్త మిత్రులు ఉన్నవాళ్లు బద్ధ శత్రువులుగా మారతారు. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఒకప్పుడు ఆప్తమిత్రులుగా ఉన్న యువరాజ్ సింగ్- ఎమ్మెస్ ధోనీ, ఆ తర్వాత శత్రువులుగా మారితే... ఇప్పుడు యువీకి సురేష్ రైనా కూడా జత అయ్యాడు..

PREV
113
అప్పుడు యువీలాగే రైనా కూడా ధోనీ నమ్మకాన్ని కోల్పోయాడు... మాహీ వల్లే సీఎస్‌కే ఈ పని చేసింది...

టీమిండియాకి ఎక్కువ మ్యాచులు ఆడకపోయినా ఐపీఎల్ ద్వారా జనాల్లో బీభత్సమైన పాపులారిటీ పెంచుకున్న క్రికెటర్లలో సురేష్ రైనా ఒకడు...

213

ఎమ్మెస్ ధోనీ ఆప్తమిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ రైనా, మాహీ జపం చేసే క్రికెటర్లతో ముందు వరుసలో ఉంటాడు...

313

ఎమ్మెస్ ధోనీని రోల్‌ మోడల్‌గా భావించే రైనా, మాహీ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మరుక్షణమే... ‘నీతోనే నేను’ అంటూ తాను కూడా రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు...

413

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనా, గత సీజన్‌లో మునుపటి రేంజ్‌లో రాణించలేకపోయాడు...

513

గ్రూప్ స్టేజ్‌లో 12 మ్యాచులు ఆడిన సురేష్ రైనా, ఓ హాఫ్ సెంచరీతో 160 పరుగులు చేశాడు. నిజానికి ఎమ్మెస్ ధోనీ కంటే రైనా మెరుగ్గానే పరుగులు చేశాడు...

613

ఫామ్‌లో లేడని 2 గ్రూప్ మ్యాచులతో పాటు నాకౌట్ మ్యాచుల్లోనూ రైనాకి తుదిజట్టులో చోటు ఇవ్వలేదు ఎమ్మెస్ ధోనీ...

713

‘సురేష్ రైనా, ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోకపోవడానికి మాహీ నమ్మకాన్ని కోల్పోవడమే కారణం. ఇది అందరికీ తెలిసిన విషయమే...

813

యూఏఈ 2020 సీజన్‌ ఆరంభానికి ముందే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చేశాడు రైనా. అప్పుడే ధోనీకి, రైనాకి గొడవలు వచ్చాయని వార్తలు వచ్చాయి...

913

అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో టీమ్‌లోకి తీసుకున్నా, అతని ఫామ్‌ కూడా బాగోలేకపోవడం ఇక జట్టు నుంచి తప్పించడమే బెటర్ అని నిర్ణయం తీసుకుని ఉంటారు...
 

1013

చెన్నై సూపర్ కింగ్స్‌లో మాహీ చెప్పిందే వేదం. అది అందరికీ తెలుసు. ధోనీ, ఫలానా ప్లేయర్‌ని కొనమంటే సీఎస్‌కే ఓనర్లు, అతని కోసం పర్సులో ఉన్నదంతా పెట్టేస్తారు...

1113

అలాంటిది పర్సులో రూ.2 కోట్లు మిగిలుతున్నా, రైనాను కొనుగోలు చేయలేదంటే... ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు...

1213

రైనా ఫిట్‌గా లేడు, షార్ట్ బాల్ ఆడడానికి భయపడతాడు. అలాంటప్పుడు సీఎస్‌కే మాత్రం మాహీని కాదని సురేష్ రైనాని ఎందుకు కొనుగోలు చేస్తుంది..

1313

ఐపీఎల్‌లో రైనా లేకపోవడం నిజంగా ఓ తీర్చలేని లోటు. ఐపీఎల్ ప్రారంభం నుంచి రైనా షో చూస్తూ వచ్చాం. కానీ చిన్న చిన్న తప్పుల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సిమాన్ దుల్...

Read more Photos on
click me!

Recommended Stories