ఇన్నాళ్లు ‘కింగ్’ మాత్రమే, ఇప్పుడు కొడితే దేవుడివే! విరాట్ కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్న ఫ్యాన్స్...

Published : Jun 10, 2023, 08:59 PM IST

ప్రస్తుత తరంలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. సోషల్ మీడియాలో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్పోర్ట్స్ సెలబ్రిటీల్లో కోహ్లీ ఒకడు. మూడు ఫార్మాట్లలో పరుగుల ప్రవాహం సృష్టించిన విరాట్ కోహ్లీపై భారీ ఆశలే పెట్టుకున్నారు అభిమానులు...  

PREV
110
ఇన్నాళ్లు ‘కింగ్’ మాత్రమే, ఇప్పుడు కొడితే దేవుడివే! విరాట్ కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్న ఫ్యాన్స్...
Image credit: PTI

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో టీమిండియా ముందు 444 పరుగుల రికార్డు టార్గెట్ పెట్టింది ఆస్ట్రేలియా. టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ జట్టూ కూడా ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించిన రికార్డు లేదు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవాలంటే టీమిండియా, వరల్డ్ రికార్డు కొట్టాల్సి ఉంటుంది...

210

ఐపీఎల్ 2023 సీజన్‌లో మూడు సెంచరీలతో 890 పరుగులు చేసిన యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ 18 పరుగులు చేసి థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా పెవిలియన్ చేరాడు. దీంతో రోహిత్ శర్మ, పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే వంటి టాపార్డర్ బ్యాటర్లు రాణించడంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి..

310
Image credit: PTI

ముఖ్యంగా ఛేజ్ కింగ్‌గా పిలవబడే విరాట్ కోహ్లీ తన రేంజ్ ఇన్నింగ్స్ ఆడితే, టీమిండియా ఈ టార్గెట్‌ని ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే క్రీజులో పాతుకుపోయి ప్రతీ వికెట్‌కి భాగస్వామ్యాలు క్రియేట్ చేయడం విరాట్ కోహ్లీ అసలైన టెస్టు ఆట...

410
Image credit: PTI

లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో భాగస్వామ్యాలు నమోదు చేస్తూ, విదేశాల్లో టీమిండియాకి రికార్డు విజయాలు అందించాడు విరాట్ కోహ్లీ. ఈసారి, విరాట్ బ్యాటు నుంచి అలాంటి ఇన్నింగ్స్ ఆశిస్తోంది టీమిండియా...

510
Image credit: PTI

అయితే ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో విరాట్ కోహ్లీకి  గత ఆరేళ్లుగా ఏ మాత్రం మెరుగైన రికార్డు లేదు. 2014 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ, అదే వరల్డ్ కప్ ఫైనల్‌లో శ్రీలంకపై 77 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు..
 

610
Image credit: PTI

2016 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో వెస్టిండీస్‌పై 89 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన విరాట్ కోహ్లీ, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌పై బంగ్లాదేశ్‌పై 96 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత విరాట్ బ్యాటు నుంచి నాకౌట్ మ్యాచుల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు..
 

710
Image credit: PTI

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై 5 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై 1 పరుగుకే అవుట్ అయ్యాడు.. 2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే అవుట్ అయ్యాడు..

810

2022 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 50 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ చేసే పరుగులు, మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయబోతున్నాయనే అతిశయోక్తి లేదు..
 

910
Image credit: Getty

బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ కూడా విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి వీరోచిత ఇన్నింగ్స్ వస్తుందని ఆశపడ్డాడు. విరాట్ కోహ్లీ గొప్ప బ్యాటర్, తరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే టాలెంటెడ్ క్రికెటర్. అయితే ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విరాట్ బ్యాటింగ్, అతన్ని ట్రూ లెజెండ్స్‌ లిస్టులోకి చేరుస్తుంది..

1010

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కప్పు కొట్టినా, కొట్టకపోయినా విరాట్ కోహ్లీకి వచ్చే నష్టమేమీ లేదు. అయితే 10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ కోసం వేచి చూస్తున్న టీమిండియాకి విరాట్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ అందిస్తే... అతనికి ఉన్న హేటర్స్‌లో సగం మంది ఫ్యాన్స్‌గా మారిపోవడం ఖాయం.. 

Read more Photos on
click me!

Recommended Stories