కళ్లు మూసుకుని రీప్లే చూశావా? లేక గుడ్డోడివా... శుబ్‌మన్ గిల్ అవుట్‌పై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్..

Published : Jun 10, 2023, 07:55 PM ISTUpdated : Jun 10, 2023, 08:05 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. 444 పరుగుల భారీ లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలెట్టింది టీమిండియా. శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ కలిసి వన్డే స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తూ శుభారంభం అందించే ప్రయత్నం చేశారు..

PREV
16
కళ్లు మూసుకుని రీప్లే చూశావా? లేక గుడ్డోడివా... శుబ్‌మన్ గిల్ అవుట్‌పై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్..

అయితే తొలి వికెట్‌కి 7.1 ఓవర్లలో 41 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత శుబ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది టీమిండియా. 19 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, స్కాట్ బొలాండ్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

26

అయితే క్యాచ్ పట్టే సమయంలో బంతిని చూస్తూ ఉన్న శుబ్‌మన్ గిల్, అంపైర్ అవుట్ ఇవ్వగానే డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. అంపైర్లు కూడా క్లీన్ క్యాచ్ అవునో కాదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేశారు..

36

టీవీ రిప్లైలో కామెరూన్ గ్రీన్ క్యాచ్ పట్టేముందు బంతి నేలను తాకినట్టు క్లియర్‌గా కనిపించింది. అయితే వివిధ యాంగిల్స్‌లో చాలా సేపు రిప్లై చూసిన థర్డ్ అంపైర్, శుబ్‌మన్ గిల్ అవుట్ అయినట్టు ప్రకటించాడు..

46

‘కామెరూన్ గ్రీన్ క్యాచ్‌‌ని అందుకునే ముందు బంతి నేలను తాకినట్టు క్లియర్‌గా కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ మాత్రం అవుట్‌గా ప్రకటించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ కూడా ఈ నిర్ణయంతో చాలా నిరుత్సాహపడ్డట్టు ఉన్నారు...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్..

56
Mitchell Starc

ఇంతకుముందు వీడియోలో క్యాచ్ అందుకున్నది, లేనిదీ స్పష్టంగా తెలియకపోతే...  ఫీల్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటిస్తే ‘సాఫ్ట్ సిగ్నల్’ రూల్ ప్రకారం, థర్డ్ అంపైర్ కూడా అవుట్ ఇచ్చేవాడు. అయితే ఈ వివాదాస్పద రూల్‌ని ఈ మధ్యే తొలగించింది ఐసీసీ...

66

అయినా బాల్ కింద తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడంటే ఆస్ట్రేలియాకి అనుకూలంగా కావాలని నిర్ణయం ప్రకటించి ఉండాలి? లేదంటే కళ్లు మూసుకుని అయినా వీడియో చూసి ఉంటాడని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు...

Read more Photos on
click me!

Recommended Stories