అసలిప్పుడు చేతన్ శర్మపై స్టింగ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది... ఆసీస్ మీడియా హస్తం ఉందా..

Published : Feb 16, 2023, 12:36 PM ISTUpdated : Feb 16, 2023, 03:25 PM IST

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో చేసిన చీప్ కామెంట్లు, భారత క్రికెట్‌లో పెను ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి. సౌరవ్ గంగూలీకి నచ్చకపోవడం వల్లే విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించామని చెప్పి బీసీసీఐ మాజీ అధ్యక్షుడిని అడ్డంగా ఇరికించిన చేతన్ శర్మ, కొందరు క్రికెటర్లు డ్రగ్స్ వాడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి భారత క్రికెట్ పరువు తీసేశాడు...

PREV
18
అసలిప్పుడు చేతన్ శర్మపై స్టింగ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది... ఆసీస్ మీడియా హస్తం ఉందా..

చేతన్ శర్మ వాగిన చెత్త వాగుడంతా జీ న్యూస్ ఛానెల్ బయటపెట్టి, సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. అయితే అసలు ఇప్పుడు చేతన్ శర్మపై స్టింగ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అనేది చాలామందికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది...

28

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ భారాన్ని మోయలేకపోతున్నానని, వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే వైట్ బాల్ క్రికెట్‌లోనే ఇద్దరు కెప్టెన్లు ఎందుకు? అనే ఉద్దేశంతో బీసీసీఐ, విరాట్ నుంచి వన్డే కెప్టెన్సీ పగ్గాలు బలవంతంగా లాక్కుంది...

38

ఆ టైమ్‌లో సౌరవ్ గంగూలీ, కోహ్లీ మధ్య జరిగిన ఎపిసోడ్ చూసినవాళ్లకు.. దాదా వల్లే, విరాట్ కెప్టెన్సీ పోయిందనే విషయం క్లియర్‌గా అర్థమైపోయింది. ఇప్పుడు చేతన్ శర్మ ఓపెన్ అయిపోయి, ఇవన్నీ సీక్రెట్ కెమెరా ముందు వాగేశాడు కానీ అతను చెప్పిన విషయాల్లో చాలా మటుకు, ఇంతకుముందే చాలామందికి తెలుసు...
 

48
Sanju Samson-Chetan Sharma

అయితే ఇప్పుడు చేతన్ శర్మను ఇలా ఇరికించడం వల్ల ఎవరికి ఉపయోగం? ఈ ప్రశ్నకు సమాధానం అంతుచిక్కకుండా ఉంది. ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఓడించి వరుసగా రెండు సీజన్లలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచింది టీమిండియా... ఆసీస్, ఆసీస్ గడ్డ మీదే ఓడించడం అంటే కేవలం టెస్టు సిరీస్ గెలవడం మాత్రమే కాదు, ఆస్ట్రేలియా అహం, ఆధిపత్యాన్ని దెబ్బ తీయడం... 

తాజాగా నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియాని ఓడించి ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది టీమిండియా...

58
Image credit: Chetan Sharma/Instagram

ఈ మ్యాచ్ రిజల్ట్‌తో స్వదేశంలో భారత జట్టు దూకుడు ముందు ఆస్ట్రేలియా నిలవడం కష్టమేనని అందరికీ అర్థమైపోయింది. ఇలాగే సాగితే టీమిండియా 4-0 తేడాతో ఆస్ట్రేలియాని క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా చాలామంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ బయటికి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది..

68
CHETAN SHARMA

ఆసీస్ మీడియా పథకం ప్రకారం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మను ట్రాప్‌లోకి లాగిందా? అనే డౌట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. గెలవడానికి ఛీటింగ్ చేయడానికైనా వెనుకాడని ఆస్ట్రేలియా, బీసీసీఐ సెలక్షన్ బోర్డు అధ్యక్షుడిని వివాదంలోకి లాగుతుందా?.. అవకాశాలు తక్కువైనా, అసలు ఛాన్సే లేదని మాత్రం కొట్టిపారేయలేం.

78

చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు, టెస్టుల్లో ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీపైనే కాదు, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌తో పాటు మిగిలిన ప్లేయర్లను కూడా మానసికంగా దెబ్బ తీసే ప్రమాదం ఉంది... అన్నింటికీ మించి ఒక్కసారిగా టీమిండియా ఆట గురించి కాకుండా మిగిలిన విషయాలపై జరుగుతున్న చర్చ, భారత క్రికెటర్ల ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బ తీస్తుంది...

88

నాగ్‌పూర్ టెస్టు ఘోర ఓటమి తర్వాత టెస్టు సిరీస్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ఆస్ట్రేలియాకి ఈ ఒక్క అవకాశం చాలు... ఆస్ట్రేలియాని ‘సాండ్ పేపర్’ బాల్ టాంపరింగ్ వివాదం ఎంతలా కుదిపేసిందో, చేతన్ శర్మ వాగిన చెత్త వాగుడు, అంతకంటే ఎక్కువే టీమిండియాని దెబ్బ తీయొచ్చు... ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులను నుంచి జట్టును ఎలా బయటికి తెస్తాడనేది టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చేతుల్లోనే ఉంది..  

click me!

Recommended Stories