సంజూ శాంసన్ కెరీర్ ముగిసినట్టేనా! వాళ్లను కావాలనే పక్కనబెట్టామని ఓపెన్ అయిన చేతన్ శర్మ...

Published : Feb 16, 2023, 10:25 AM IST

చేతన్ శర్మపై జీ న్యూస్ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్, భారత క్రికెట్‌లో పెను సంచలనం క్రియేట్ చేస్తోంది. ఐసీసీ టోర్నీల సంగతి ఎలా ఉన్నా, ఐపీఎల్‌తో, ద్వైపాక్షిక సిరీస్‌లతో టాప్ టీమ్‌గా వెలుగొందుతున్న భారత్‌కి చీఫ్ సెలక్టర్‌గా ఉన్న చేతన్ శర్మ చేసిన చీప్ కామెంట్లు పెద్ద అపవాదునే తెచ్చిపెట్టాయి...  

PREV
16
సంజూ శాంసన్ కెరీర్ ముగిసినట్టేనా! వాళ్లను కావాలనే పక్కనబెట్టామని ఓపెన్ అయిన చేతన్ శర్మ...
Image credit: PTI

స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ వాగిన చెత్తలో విరాట్ కోహ్లీ- సౌరవ్ గంగూలీ వివాదమై ఎక్కువగా హైలైట్ అయ్యింది. ఫిట్‌గా కనిపించేందుకు కొందరు ప్లేయర్లు, డ్రగ్స్ వాడతారని చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం క్రియేట్ చేస్తున్నాయి...

26
CHETAN SHARMA

ఈ రెండింటితో పాటు తాగిన మత్తులో బయటపడ్డాడా? లేక ఏదో జోష్‌లో నోటికి వచ్చిదంతా వాగుతూ ఓపెన్ అయ్యాడో తెలీదు కానీ చేతన్ శర్మ చాలా విషయాలను బయటపెట్టాడు. ముఖ్యంగా కొందరు ప్లేయర్లను కావాలని సైడ్ చేస్తున్నట్టు కామెంట్ చేశాడు బీసీసీఐ చీఫ్ సెలక్టర్...

36
Sanju Samson-Chetan Sharma

‘రిషబ్ పంత్ గాయపడ్డాడు. కాబట్టి అతని ప్లేస్‌లో ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు. కెఎల్ రాహుల్ కూడా కీపింగ్ చేయగలడు. సంజూ శాంసన్ రూపంలో మరో వికెట్ కీపర్‌ని ట్రై చేశాం.. 

46
Sanju Samson

శిఖర్ ధావన్ కెరీర్ ముగిసిపోయింది. కావాలనే అతన్ని సైడ్ చేశాం. అలాగే సంజూ శాంసన్ కెరీర్ కూడా దాదాపు ముగిసినట్టే. దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్‌లో బాగా ఆడిన ప్లేయర్లకు... ఛాన్సులు ఇస్తాం!సమయం కోసం ఎదురుచూడమని చెబుతాం... అలా చెబుతూనే ఉంటాం కానీ ఛాన్సులు మాత్రం ఇవ్వం...

56
KL Rahul

టీమ్‌లో ఒకటికి నలుగురు వికెట్ కీపర్లు ఉన్నప్పుడు ఎంతమందిని అని ఆడించగలం. టీమ్‌లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదనేది సెలక్టర్లం, మేమే డిసైడ్ చేస్తాం... భారత క్రికెట్ మా చేతుల్లోనే ఉంది...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు చేతన్ శర్మ...

66
Sanju Samson

ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే సంజూ శాంసన్ తిరిగి టీమ్‌లో చోటు దక్కించుకోవడం అనుమానమే. క్రికెట్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డులో జాతి వివక్ష గురించి ఎంత రచ్చ జరిగిందో, ఇప్పుడు చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే బీసీసీఐలో అంతకుమించిన ఫేవరిజం, పాలిటిక్స్ ఉన్నట్టు జనాలకు అర్థమవుతోంది... 

click me!

Recommended Stories