ఆ ఇద్దరూ వచ్చేశారు... చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో టైటిల్ గెలుస్తుందా...

First Published Apr 5, 2021, 3:29 PM IST

ఐపీఎల్ కెరీర్‌లో ఆడిన 11 సీజన్లలో 10 సార్లు ఫైనల్ చేరిన ఒకే ఒక్క జట్టు చెన్నై సూపర్ కింగ్స్... గత సీజన్‌లో మాత్రం ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టలేకపోయిన సీఎస్‌కే, పాయింట్ట పట్టికలో ఏడో స్థానంలో నిలిచి అభిమానులను షాక్‌కి గురి చేసింది. అయితే ఈసారి సురేశ్ రైనా రీఎంట్రీ ఇస్తుండడంతో అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్...

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో గత సీజన్‌లో ఘోరంగా ఫెయిల్ అయిన చెన్నై సూపర్ కింగ్స్...ఈ సారి ‘చిన్న తల’ సురేశ్ రైనా రీఎంట్రీ ఇస్తుండడంతో అతనిపై బోలెడు ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో ఒకడైన రైనా, ఈసారి అదరగొడతాడని ఆశిస్తున్నారు.
undefined
గత సీజన్ ఆరంభానికి ముందు యూఏఈ చేరుకున్న సురేశ్ రైనా, తన భార్య ప్రియాంక తండ్రిగారి ఇంటిపై దుండగులు దాడి చేసి, ఆయన మామను చంపేయడంతో ఆకస్మాత్తుగా స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఆ సంఘటన తర్వాత కుటుంబానికి అండగా ఇక్కడే ఉండిపోయాడు ‘మిస్టర్ ఐపీఎల్’ రైనా...
undefined
ధోనీ కెప్టెన్సీలో భారత జట్టులో స్టార్ ప్లేయర్‌గా వెలుగొందిన సురేశ్ రైనా, మహీ రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే తాను కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుతున్నట్టు ప్రకటించాడు...
undefined
మాహీ అంటే అంతటి అభిమానం, ఐపీఎల్‌లో ఎలా ఆడాలో పక్కాగా తెలిసిన ‘మిస్టర్ ఐపీఎల్’ సురేశ్ రైనా జోరు మీదుంటే, సింగిల్ హ్యాండ్‌తో జట్టుకి విజయాలను అందించగలడు...
undefined
అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో గాయపడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మూడు నెలల విశ్రాంతి తర్వాత మళ్లీ క్రికెట్‌లో రీఎంట్రీ ఇస్తున్నాడు. గాయం కారణంగా గబ్బా టెస్టుతో పాటు ఇంగ్లాండ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు రవీంద్ర జడేజా...
undefined
టీమిండియాలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నప్పటికీ తన ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి జడేజా, ఐపీఎల్‌లో ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వడం చాలా కీలకం. ఇప్పటికే జట్టులో చోటు కోసం పోటీ పెరిగిపోయిన వేళ, జడ్డూ పర్ఫామెన్స్, టెస్టు ఛాంపియన్‌షిప్ జట్టులో అతని ప్లేస్‌ను డిసైడ్ చేయనుంది...
undefined
సురేశ్ రైనా మూడో నెంబర్ ఆటగాడు కాగా, రవీంద్ర జడేజా 8వ నెంబర్ ప్లేయర్. ఈ ఇద్దరూ కలవడంతో 11 మందితో కూడిన జట్టు తయారైపోయిందంటూ ట్విట్టర్‌లో పోస్టు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
undefined
ఐపీఎల్ 2021 వేలంలో మొయిన్ ఆలీని రూ.7 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సీఎస్‌కే, కృష్ణప్ప గౌతమ్‌ కోసం ఏకంగా రూ.9.25 కోట్లు కుమ్మరించింది.
undefined
వీరితో పాటు రాబిన్ ఊతప్పను రూ.3 కోట్లకు ట్రేడ్ చేసుకున్న సీఎస్‌కే, టెస్టు ప్లేయర్‌ ఛతేశ్వర్ పూజారాను కొనుగోలు చేసింది.
undefined
వాస్తవానికి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021 వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్ల పట్ల సీఎస్‌కే అభిమానులు ఏ మాత్రం సంతోషంగా లేరు. అయితే లీగ్ ఆరంభంలో విజయాలు అందుకుంటే, సీఎస్‌కే మళ్లీ పునర్‌వైభవం అందుకుంటుంది.
undefined
click me!