అతనితో పోటీ ఎప్పుడూ మజాగా ఉంటుంది... పంజాబ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ కామెంట్...

First Published Apr 5, 2021, 1:21 PM IST

గత సీజన్‌ ఆరంభంలో అద్భుతంగా రాణించిన మయాంక్ అగర్వాల్, ఆరెంజ్ క్యాప్ వేటలో పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌కి పోటీ వచ్చాడు. అయితే తనకే పోటీ వస్తున్నాడనే కారణంగానేమో ఫామ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్‌ను కొన్ని కీలక మ్యాచ్‌లకు పక్కనబెట్టాడు కెఎల్ రాహుల్... అయితే కెఎల్ రాహుల్‌తో పరుగులు చేయడంలో పోటీపడడం, తనకెప్పుడూ మజాగానే ఉంటుందని అంటున్నాడు మయాంక్ అగర్వాల్...

2020లో యూఏఈలో జరిగిన సీజన్‌లో 11 మ్యాచులు ఆడిన మయాంక్ అగర్వాల్, ఓ అద్భుత సెంచరీతో 424 పరుగులు చేశాడు.
undefined
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఒంటరి పోరాటం చేసిన మయాంక్ అగర్వాల్, మ్యాచ్‌ను గెలిపించినంత పని చేశాడు. అయితే అంపైర్ షాట్ రన్ ఇవ్వడంతో ఆ మ్యాచ్ టైగా ముగిసి, సూపర్ ఓవర్‌లో ఓటమి పాలైంది పంజాబ్...
undefined
‘2021 సీజన్‌లో కూడా కెఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలని అనుకుంటున్నా... ఇండియా, ఐపీఎల్ మ్యాచులు జరగడం చాలా సంతోషంగా ఉంది. అయితే జనాలు లేకపోవడం కాస్త బాధగా ఉంది... ఇండియాలో మ్యాచులు ఆడడం ఎప్పుడూ థ్రిల్లింగ్‌గా ఉంటుంది...
undefined
బెంగళూరులో నా ఫిట్‌నెస్‌ను, స్కిల్స్‌ను రాటుతేల్చేందుకు నేను నిత్యం కష్టపడుతూనే ఉన్నాను. టీ20 ఫార్మాట్‌లో రాణించాలంటే టాప్ ఫిట్‌నెస్, షార్ప్ స్కిల్స్ అవసరం... గత సీజన్‌లో నా ప్రదర్శన, సంతృప్తినిచ్చింది. ఈ సీజన్‌లో కూడా అంతకంటే మెరుగ్గా రాణిస్తాననే అనుకుంటున్నా...
undefined
ప్రతీ ఏటా ఐపీఎల్ క్రికెటర్లకి తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఓ అద్భుతమైన వేదికని అందిస్తుంది... అందుకే ఈసారి ఐపీఎల్‌లో రాణించడంపై పూర్తిగా ఫోకస్ పెట్టాను. ఐపీఎల్‌లో రాణిస్తే, టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కుతుందని అనుకోవడం లేదు..
undefined
ప్రతీ ఫార్మాట్‌లోనూ భారత జట్టు అదరగొడుతోంది. ఇప్పుడు భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే మెరికల్లాంటి క్రికెటర్లతో పోటీ పడాల్సి ఉంటుంది. ఇలాంటి పోటీ మంచిదే. పోటీ ఎంత పెరిగితే, మన టాలెంట్‌ను మరింత పదును పెట్టుకోవడానికి అవకాశాలు అంతగా పెరుగుతాయి...
undefined
గత మూడేళ్లలో భారత జట్టు చాలా మారిపోయింది. జట్టులో చోటు దక్కించుకోవడం కోసం వందకు 200 శాతం పర్ఫామెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది.’ అంటూ కామెంట్ చేశాడు మయాంక్ అగర్వాల్...
undefined
‘అనిల్ భాయ్ నాకు ఎంతగానో సహకరిస్తారు. ఆయన సలహాలు, సూచనలు నా క్రికెట్‌ను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఆయనకి పదునైన క్రికెట్ బుర్ర ఉంది. మన నుంచి ఏం కావాలో దాన్ని ఎలా తీసుకోవాలో అనిల్ కుంబ్లేకి బాగా తెలుసు... మ్యాచులకు ముందు ఆయనతో కలిసి నెట్స్‌లో చాలా సమయం గడుపుతుంటాను...
undefined
అనిల్ కుంబ్లే లాంటి కోచ్ ఉంటే క్రికెటర్లకు పని తేలికవుతుంది. గత సీజన్‌లో నా పర్ఫామెన్స్‌కి కుంబ్లే భాయ్ కూడా ప్రధాన కారణం... రాహుల్ ఓ అద్భుతమైన క్రికెటర్. అతను ఆట చూస్తుంటే, ఇంత తేలిగ్గా పరుగులు చేయొచ్చా... అని ఆశ్చర్యం వేస్తుంది...
undefined
కెఎల్ రాహుల్‌కీ, నాకు మంచి స్నేహం ఉంది. ఇద్దరం కలిసి బెంగళూరులో చాలాసార్లు క్రికెట్ ఆడాం. మా స్నేహం, క్రికెట్‌ని అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడింది. అతనితో పోటీపడడం నాకెప్పుడూ ఇష్టమే’ అంటూ కామెంట్ చేశాడు మయాంక్ అగర్వాల్...
undefined
click me!