మురళీధరన్‌ వల్లే సన్‌రైజర్స్ ఇలా తయారైంది, గెలుస్తున్న టీమ్‌ని... మహ్మద్ కైఫ్ కామెంట్...

First Published May 14, 2022, 5:00 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌పై పెద్దగా అంచనాలు లేవు. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, రషీద్ ఖాన్ వంటి ప్లేయర్లను వేలానికి వదిలేసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, మెగా వేలంలో వ్యవహరించిన తీరుపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి...

ఐపీఎల్ 2022 సీజన్‌ని రెండు ఘోర ఓటములతో ప్రారంభించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆ తర్వాత వరుసగా ఐదు విజయాలు అందుకుని, అన్యూహ్యాంగా టాప్ టీమ్ పర్ఫామెన్స్‌తో అభిమానుల్లో కొత్త ఆశలు రేపింది...

7 మ్యాచుల్లో 5 విజయాలు అందుకోవడంతో మిగిలిన 7 మ్యాచుల్లో 3 గెలిచినా ప్లేఆఫ్స్ చేరుతుందని భావించారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది...

‘ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలింగ్ అంత బలంగా ఏమీ కనిపించడం లేదు. జాన్సెన్‌ని డ్రాప్ చేసి, కార్తీక్ త్యాగిని ఆడించాలని అనుకుంటున్నారు. మరో బౌలర్‌ని ఎవరినో ట్రై చేశారు...

జట్టులో ఇన్ని మార్పులు చేసిన తర్వాత విజయాలు రావాలని కోరుకుంటే ఎలా. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా ఐదు విజయాలు అందుకుని కమ్‌బ్యాక్ ఇచ్చిందంటే దానికి వారి ఫాస్ట్ బౌలర్లే కారణం...

నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెస్ అద్భుతంగా అదరగొట్టాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో వీరిని కలిసి ఆడించడమే లేదు. సన్‌రైజర్స్ పర్ఫామెన్స్ పడిపోవడానికి ముత్తయ్య మురళీధరనే కారణం...

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్, జాన్సెన్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదిన తర్వాత.. ముత్తయ్య మురళీధరన్ తన కోపాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో ఫాస్ట్ బౌలర్లపై చూపించాడు...

ఇదే ఎస్‌ఆర్‌హెచ్ రిథమ్‌ని పాడుచేసినట్టుంది. కేకేఆర్ టీమ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు సన్‌రైజర్స్‌లోనూ అదే జరుగుతోంది. ముత్తయ్య మురళీధరన్ చాలా కామ్ అండ్ కూల్ పర్సన్...

అలాంటి వ్యక్తి ఇలా అరుస్తూ, ప్లేయర్లపై కోపాన్ని చూపిస్తే... టీమ్ వాతావరణం దెబ్బతింటుంది. ఆ మ్యాచ్ తర్వాత జాన్సెన్‌ను జట్టు నుంచి తప్పించారు. అతన్ని కొనసాగించి ఉంటే, రిజల్ట్ వేరేగా వచ్చి ఉండేది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...

click me!