హైదరాబాద్ : ఆయన జ్యోతిష్యం చెప్పినా, పూజలు చేయించినా, చివరకు వ్యాపారం చేసినా వివాదాస్పదమే. ఎవరూ అడక్కపోయినా సినీతారలు, రాజకీయ ప్రముఖుల జాతకాలు ఇలా వున్నాయి, అలా వున్నాయని చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ఆ జ్యోతిష్యుడు. అతడు చెప్పినవి నిజం అవుతాయో లేదో తెలీదుగానీ అతడు చెప్పే జాతకాలు మాత్రం వివాదం కావడం పక్కా. ఇలా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా కనిపిస్తూ పాపులర్ అయ్యారు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి. ఇప్పుడు సినిమాలు, రాజకీయ జాతకాలు వదిలేసి స్పోర్ట్స్ పై పడ్డారాయన.