Fastest 100s in IPL : ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ టాప్-5 సెంచ‌రీలు ఇవే...

First Published Apr 16, 2024, 8:10 AM IST

Fastest 100s in IPL : ఐపీఎల్ లో సెంచ‌రీల మోత మోగుతోంది. ఐపీఎల్ 2024లో ఇప్పటికే మూడు సెంచ‌రీలు న‌మోదుకాగా, ట్రావిస్ హెడ్ 39 బంతుల్లోనే రికార్డు సెంచ‌రీని కొట్టాడు. ఈ సీజ‌న్ లో ఇప్ప‌టికే విరాట్ కోహ్లీ, జోస్ బ‌ట్ల‌ర్, రోహిత్ శ‌ర్మ‌లు సెంచ‌రీలు కొట్టారు. అయితే, ఐపీఎల్ హిస్టరీలో న‌మోదైన ఫాస్టెస్ట్ టాప్- సెంచ‌రీలు ఇలా ఉన్నాయి..
 

Chris Gayle, Travis Head, Yusuf Pathan

5. ఆడమ్ గిల్ క్రిస్ట్

తాజాగా జ‌రిగిన బెంగ‌ళూరు-హైద‌రాబాద్ మ్యాచ్ లో హెడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడక ముందు ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ఐపీఎల్ లో అద్భుత‌మైన సెంచ‌రీని సాధించిన ఆస్ట్రేలియాన్ ప్లేయ‌ర్ గా ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ లో ముంబై ఇండియన్స్ లో జరిగిన మ్యాచ్లో 42 బంతుల్లో సెంచరీ కొట్టాడు ఈ మాజీ పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయ‌ర్.
 

4. ట్రావిస్ హెడ్

బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ త‌ర్వాత దానిని సెంచ‌రీగా మ‌లిచాడు. ఐపీఎల్ 2024 30వ మ్యాచ్ లో హెడ్ 41 బంతుల్లో 102 పరుగులు చేయడంతో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డును బద్దలు కొట్టింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీపై హెడ్ 9 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు.

Image credit: PTI

3. డేవిడ్ మిల్ల‌ర్ 

మొహాలీ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ సూపర్ స్టార్ డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లోనే సంచలన సెంచరీ సాధించాడు. 2013 టీ20 టోర్నమెంట్లో పంజాబ్ కింగ్స్ మాజీ స్టార్ ఈ ఘనత సాధించాడు. మిల్లర్ 38 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. పీబీకేఎస్ 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2. యూస‌ఫ్ ప‌ఠాన్

టీమిండియా మాజీ స్టార్ ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2010 ఎడిషన్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. చిరస్మరణీయ సెంచరీ చేసిన ఆర్ఆర్ మాజీ బ్యాటర్ పఠాన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Chris Gayle

1. క్రిస్ గేల్: 

యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్ లో అనేక రికార్డులు సృష్టించాడు. అత‌ని పేరుమీద‌నే ఐపీఎల్ లో అత్యంత వేగ‌వంత‌మైన (ఫాస్టెస్ట్) సెంచ‌రీ రికార్డు ఉంది. 2023లో ఫూణేతో జ‌రిగి మ్యాచ్ లో క్రిస్ గేల్ కేవ‌లం 30 బంతుల్లోనే సెంచ‌రీ కొట్టాడు. 66 బంతుల్లో 175 ప‌రుగుల‌తో గేల్ నాటౌగ్ గా నిలిచిన ఈ మ్యాచ్ లో బెంగ‌ళూరు 263/5 ప‌రుగులు చేయ‌గా, ఫూణే  20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 133/9 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

click me!