IPL: చాహర్ కు గాయం.. ఐపీఎల్ కు అనుమానమే..! తలలు పట్టుకుంటున్న సీఎస్కే ఫ్యాన్స్ .. రూ. 14 కోట్లు పోయినట్టేనా..?

Published : Feb 23, 2022, 11:51 AM IST

Deepak Chahar:  రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం  భారీ ఆశలతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది.  ఈ సీజన్ కోసం   ఏకంగా రూ. 14 కోట్లు ఖర్చు చేసి  చాహర్ ను దక్కించుకున్న ఆ జట్టు...

PREV
19
IPL: చాహర్ కు గాయం.. ఐపీఎల్ కు అనుమానమే..! తలలు పట్టుకుంటున్న సీఎస్కే ఫ్యాన్స్ .. రూ. 14 కోట్లు పోయినట్టేనా..?

ఇటీవలే ముగిసిన  ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్.. టీమిండియా ఆల్ రౌండర్ దీపక్ చాహర్ ను  రూ. 14 కోట్లతో దక్కించుకుంది. అతడి కోసం రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడినా.. చాహర్  కు భారీ ధర వెచ్చించి తీసుకుంది సీఎస్కే. 

29

అయితే విండీస్ తో టీ20 సిరీస్ సందర్భంగా  చాహర్ కు గాయమైంది. దీంతో అతడు మూడో టీ20లో తన కోటా ఓవర్లు పూర్తి చేయకుండానే  గ్రౌండ్ ను వీడాడు.

39

చాహర్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన బీసీసీఐ వైద్య బృందం..  అతడికి  తొడ కండరాలు పట్టినట్టు తేల్చినట్టు సమాచారం. గాయం తీవ్రం కావడంతోనే  చాహర్.. విండీస్ తో ముగిసిన ఆఖరు టీ20లో  మళ్లీ బౌలింగ్ కు రాలేదు.

49

శ్రీలంకతో  టీ20 సిరీస్ కు అతడు ఎంపికైనా.. జట్టుతో పాటు చాహర్ లక్నోకు వెళ్లలేదు. అతడు బెంగళూరుకు వెళ్లనున్నట్టు సమాచారం. బెంగళూరులోని  జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో  రిహాబిటేషన్ లో ఉండనున్నాడు.

59

చాహర్ కు అయిన గాయాన్ని బట్టి అతడు  తక్కువలో తక్కువ ఆరు నుంచి ఎనిమిది వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు  తేల్చినట్టు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే.. ఇది చెన్నైకి ఊహించని ఎదురుదెబ్బే.

69

గాయం నుంచి కోలుకున్నా చాహర్ తిరిగి ఫిట్నెస్ నిరూపించుకుని మ్యాచులు ఆడటం ఇప్పట్లో లేనట్టేనని జట్టు వర్గాలు చెబుతున్నాయి.  ఇదే విషయమై జట్టు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. ‘అతడి గాయం తీవ్రంగా ఉంది. శ్రీలంకతో సిరీస్ కు దూరమైన చాహర్.. ఐపీఎల్ ఆడే అవకాశం కూడా తక్కువే.

79

బహుశా అతడు  రాబోయే ఐపీఎల్ సీజన్ ఆడటం అనుమానమే అని చెప్పాలి..’ అని తెలిపాడు. దీంతో ఆ జట్టు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. రూ. 14 కోట్లు వెచ్చించి  దక్కించుకున్న చాహర్ సేవలను కోల్పోయినట్టైతే అది సీఎస్కేకు భారీ దెబ్బగానే పరిగణించవచ్చు. 

89

అయితే చాహర్ విషయంలో సీఎస్కే మాత్రం నమ్మకంగా ఉంది. ఐపీఎల్ ప్రారంభానికల్లా  చాహర్ కోలుకుంటాడని..అతడు ఈ సీజన్ ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. 

99

మార్చి 26 నుంచి మే మధ్య జరిగే ఐపీఎల్-15 సీజన్ కోసం  ఆయా జట్లు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. వేలం ముగిసిన నేపథ్యంలో జట్లన్నీ.. జట్ల కూర్పు,  మ్యాచులలో అనుసరించబోయే  వ్యూహాల గురించి  సమాలోచనలు చేస్తున్నాయి. 

click me!

Recommended Stories