Shane Watson Gives Shock To MS Dhoni: మరో నెల రోజుల్లో ఐపీఎల్ 2022 ప్రారంభం కావాల్సి ఉండగా.. సీఎస్కే సారథి ధోనికి నమ్మకస్తుడిగా ఉన్న ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఆ జట్టుకు ఊహించని షాకిచ్చాడు.
ఐపీఎల్-15 ప్రారంభానికి కొద్దిరోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆ జట్టు మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ ఊహించని షాకిచ్చాడు. ఇన్నాళ్లు ధోనికి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న వాట్సన్ ఇప్పుడు చెన్నైని వీడనున్నాడు.
27
వచ్చే సీజన్ నుంచి వాట్సన్ ఢిల్లీ క్యాపిటల్స్ తో చేరనున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చక్రం తిప్పాడు
37
గతంలో కొన్నాళ్ల పాటు సీఎస్కే తరఫున ఆడిన వాట్సన్ కు ధోనితో సత్సంబంధాలున్నాయి. ధోని, రైనా, బ్రావో, జడేజా, వాట్సన్, డుప్లెసిస్.. ఇలా చెన్నైకి ఓ కోర్ గ్రూప్ ఉండేది.
47
కానీ వాట్సన్ రిటైర్ కావడం.. ఈ వేలంలో సీఎస్కే రైనాను దక్కించుకోకపోవడంతో పాటు యువ ఆటగాళ్లపై ఎక్కువగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ధోనికి తోడుగా వాట్సన్ ఉంటాడని అందరూ భావించారు. ఆటగాడిగా రిటైరైనా వాట్సన్ మాత్రం కోచింగ్ స్టాఫ్ గా వస్తాడని అంతా భావించారు.
57
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వాట్సన్.. సీఎస్కేకు షాకిచ్చాడు. రాబోయే సీజన్ నుంచి అతడు ఢిల్లీకి అసిస్టెంట్ కోచ్ గా మారనున్నాడు. ఈ మేరకు ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చక్రం తిప్పాడు. అసిస్టెంట్ కోచ్ గా ఉండేందుకు వాట్సన్ ను పాంటింగ్ ఒప్పించాడు.
67
40 ఏండ్ల వాట్సన్.. మహ్మద్ కైఫ్ స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు. ఈ ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ గతంలో 2008 లో రాజస్థాన్ రాయల్స్, 2018లో చెన్నై ఐపీఎల్ విజేతగా నిలిచినప్పుడు ఆ జట్లలో సభ్యుడు.
77
ఢిల్లీ కోచింగ్ స్టాఫ్ ఇదే : రికీ పాంటింగ్, అసిస్టెంట్ కోచ్ : షేన్ వాట్సన్, ప్రవీణ్ తామ్రే, అజిత్ అగార్కర్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ : జేమ్స్ హోప్స్, టీమ్ స్కౌట్ అండ్ అడ్వైజర్ : సబా కరీం.