ఆ సంఘటన తర్వాత క్రికెట్ ఆడలేనేమోనని భయమేసింది, అమ్మదగ్గరికెళ్లి ఏడ్చేశా... - ఛతేశ్వర్ పూజారా...

First Published May 8, 2021, 12:09 PM IST

వన్డే, టీ20 ఫార్మాట్‌లో పక్కనబెడితే టెస్టుల్లో మాత్రం టీమిండియాకి బ్యాటింగ్ ఆర్డర్‌లో ‘వెన్నెముక’లాంటి ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా. మాజీ క్రికెటర్ ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్న పూజారా... ‘మోడ్రన్ వాల్’గా పేరు దక్కించుకున్నాడు. 

టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్ మ్యాచ్‌ జరగబోతున్న సౌంతిమ్టన్‌లో ఇప్పటిదాకా 37 మంది భారత బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేశారు. అయితే అక్కడ టెస్టుల్లో సెంచరీ చేసిన ఒక్క భారత ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా మాత్రమే...
undefined
ఇంగ్లాండ్‌తో ఛతేశ్వర్ పూజారాకి ఉన్న రికార్డు కారణంగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అతని పర్ఫామెన్స్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా తన కెరీర్‌లో ఎదుర్కొన్న అతి క్లిష్టమైన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు పూజారా...
undefined
‘క్రికెట్‌లో గాయాలు సర్వసాధారణం. అయితే నా కెరీర్ ఆరంభంలోనే తగిలిన ఓ గాయం తీవ్ర మనోవేధనకు గురి చేసింది. మొదటి టెస్టు సిరీస్‌లోనే గాయపడిన నేను, దాని నుంచి కోలుకోవడానికి చాలా కష్టపడ్డాను.
undefined
నా గాయాన్ని పరీక్షించిన ఫిజియో, కోలుకోవడానికి ఆరు నెలల దాకా సమయం పడుతుందని చెప్పారు. ఏ క్రికెటర్‌కి అయినా ఆరు నెలలు చాలా విలువైన సమయం.
undefined
గాయం నుంచి కోలుకుని, మళ్లీ ప్రాక్టీస్ మొదలెట్టి జట్టులో స్థానం సంపాదించుకోవడం చాలా కష్టమైన పని... అందుకే ఫిజియో చెప్పిన మాటలు వినగానే తట్టుకోలేక ఏడ్చేశాను...
undefined
గాయం వల్ల కలిగిన నొప్పి కంటే, క్రికెట్‌కి దూరమైపోతానేమోననే నెగిటివ్ థింకింగ్ నన్ను ఎక్కువగా కలిచివేసింది. మళ్లీ క్రికెట్ ఆడగలనా? లేదా? ఇక నా కెరీర్ ముగిసినట్టేనా...
undefined
ఇలాంటి ఆలోచనలు నన్ను రోజూ తినేసేవి... ఆ ఆలోచనలతో నా బుర్ర మొత్తం వేడెక్కిపోయేది. కొన్నిసార్లు ఆ ప్రెషర్ తట్టుకోలేక అమ్మదగ్గరికెళ్లి గట్టి ఏడ్చేశాను కూడా...
undefined
అయితే ఆ సమయంలో నా కుటుంబం, నా స్నేహితులు నాకు ఎంతో అండగా నిలిచారు. గాయం నుంచి కోలుకుంటాడని, కమ్‌బ్యాక్ ఇస్తావని ధైర్యం చెప్పారు.
undefined
భవిష్యత్తు గురించి కాకుండా గాయం నుంచి ఎంత వేగంగా కోలుకోవాలో ఆలోచించాలని సూచించారు. వారి సలహాతోనే ధ్యానం, యోగ అలవాటు చేసుకున్నా...
undefined
ఫిజియో చెప్పినదానికంటే త్వరగానే గాయం నుంచి కోలుకున్నాను. ఈ సంఘటన తర్వాత ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కోగల మానసిక స్థైర్యం నాలో పెరిగింది...’ అంటూ చెప్పుకొచ్చాడు ఛతేశ్వర్ పూజారా...
undefined
సిడ్నీలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఛతేశ్వర్ పూజారా... ‘గబ్బా’ టెస్టులో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. బౌన్సర్లతో ఆసీస్ పేసర్లు పూజారా శరీరానికి గాయాలు చేస్తున్నా మొండిగా క్రీజులో నిలబడి బ్యాటింగ్ చేశాడు...
undefined
ఆసీస్ పేసర్ల ధాటికి ఛతేశ్వర్ పూజారా ఒంటికి దాదాపు 12 గాయాలు అయ్యాయి. అయినా బ్యాటింగ్ కొనసాగించిన పూజారా, మిగిలిన ప్లేయర్లలో గెలుపు మీద కసిని, ఏది ఏమైనా ఓటమిని మాత్రం ఒప్పుకోకూడదనే మొండిపట్టుదలను పెంచాడు.
undefined
click me!