భారత మహిళా టీమ్ హెడ్ కోచ్‌గా రమేశ్ పవార్... మిథాలీరాజ్‌తో గొడవల తర్వాత కూడా...

Published : May 13, 2021, 06:11 PM IST

భారత మహిళా జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ ఎంపికయ్యాడు. మూడేళ్ల క్రితం భారత మహిళా జట్టుకి కోచ్‌గా వ్యవహారించి, భారత సీనియర్ ప్లేయర్ మిథాలీరాజ్‌‌తో గొడవల వల్ల ఆ పదవి నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న పవార్, మళ్లీ అదే పదవికి ఎంపికకావడం విశేషం.

PREV
17
భారత మహిళా టీమ్ హెడ్ కోచ్‌గా రమేశ్ పవార్... మిథాలీరాజ్‌తో గొడవల తర్వాత కూడా...

2018 టీ20 వరల్డ్‌కప్ సమయంలో భారత జట్టుకి కోచ్‌గా వ్యవహారించాడు రమేశ్ పవార్. ఆ సమయంలో భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్‌కి భారత జట్టులో చోటు కల్పించకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. 

27

తనను కావాలనే టీ20 జట్టుకి దూరం చేస్తున్నారని హెడ్ కోచ్ రమేశ్ పవార్, సీఓఏ సభ్యురాలు డియానా ఎడ్లుల్జీలపై ఆరోపణలు చేసింది మిథాలీరాజ్. బ్యాటింగ్ ఆర్డర్‌లో తనని కింద ఆడాల్సిందిగా వాళ్లు ఒత్తిడి పెడుతున్నారని ఆరోపించింది మిథాలీ...

37

అయితే రమేశ్ పవార్, మిథాలీపై రివర్స్ ఆరోపణలు చేశాడు. ‘సీనియర్ ప్లేయర్‌గా జట్టు పరిస్థితిని అర్థం చేసుకుని, ఆడాల్సిన మిథాలీరాజ్, బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి పంపితే, రిటైర్మెంట్ ప్రకటిస్తానని బెదిరించిందని’ ఆరోపించాడు రమేశ్ పవార్...

47

ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మిథాలీజ్ 50 పరుగులు చేసి ఆదుకుంది. అయితే మిథాలీ ఇన్నింగ్స్‌లో 25 డాట్ బాల్స్ ఉండడంతో ఆమె కేవలం తన వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతోందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు రమేశ్ పవార్...

57

ఈ సంఘటన తర్వాత డబ్ల్యూవీ రామన్, భారత మహిళా జట్టుకి కోచ్‌గా వ్యవహారస్తున్నాడు. తాజాగా మహిళా జట్టు హెడ్ కోచ్‌ కోసం దరఖాస్తులు కోరింది బీసీసీఐ. ఈ పోస్టు కోసం 35 అప్లికేషన్లు రాగా, క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) రమేశ్ పవార్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది.

67

రమేశ్ పవార్‌తో వివాదం తర్వాత టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది మిథాలీరాజ్. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ ఆడిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తోంది 38 ఏళ్ల మిథాలీరాజ్...

77

ఈ సమయంలో రమేశ్ పవార్‌ను తిరిగి భారత మహిళా జట్టు కోచ్‌గా నియమించడంతో మిథాలీరాజ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. రమేశ్ పవార్‌ను టీమిండియా కోచ్‌గా ఎంపిక చేయాలని భారత టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కోరినట్టు సమాచారం.

click me!

Recommended Stories