Champions Trophy 2025: పాకిస్తాన్ vs న్యూజిలాండ్.. ఫస్ట్ మ్యాచ్ లో గెలిచేది ఎవరు?

Published : Feb 19, 2025, 12:06 PM IST

ICC Champions Trophy 2025 Pakistan vs New Zealand: ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ  బుధవారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ప్రస్తుత ఛాంపియన్ పాకిస్తాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచేది ఎవరు?

PREV
16
Champions Trophy 2025: పాకిస్తాన్ vs న్యూజిలాండ్.. ఫస్ట్ మ్యాచ్ లో గెలిచేది ఎవరు?
NZ vs PAK

ICC Champions Trophy: మరో క్రికెట్ సమారానికి ప్రపంచ దేశాలు సై అంటున్నాయి. స్పోర్ట్స్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 9వ సీజన్ బుధవారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ప్రస్తుత ఛాంపియన్ పాకిస్తాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కరాచీ స్టేడియంలో జరుగుతుంది. ఈ రెండు జట్లు విజయంతో టోర్నీని ప్రారంభిచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీని కోసం తమ ముందున్న అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. మరి గెలిచేది ఎవరు? 

ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. బీసీసీఐ, ఐసీసీలతో విభేదాల నడుమ టోర్నమెంట్‌ను తమ దేశంలోనే నిర్వహించుకుంటున్న పాకిస్తాన్, స్వదేశంలోనే ట్రోఫీ గెలవాలనే ఆశతో బరిలోకి దిగుతోంది. అయితే ఇటీవలే పాకిస్తాన్‌లో జరిగిన ట్రై సిరీస్‌ను గెలిచిన న్యూజిలాండ్ కూడా అదే ధీమాతో బరిలోకి దిగుతోంది.

26

పాకిస్తాన్ బలమేంటి? 

మొహమ్మద్ రిజ్వాన్ నాయకత్వంలోని పాక్ జట్టులో బాబర్ ఆజం, ఫఖర్ జమాన్ వంటి అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్లు ఉన్నారు.  వీరి అరంభం బాగుంటే భారీ స్కోర్ చేయడం పక్కా.  ఆఘా సల్మాన్ కీలక ఆటగాడిగా నిలుస్తారని భావిస్తున్నారు.

బౌలింగ్ విభాగంలో షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, నసీమ్ షా వంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. వీరికి స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఎంత మేరకు సహకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. స్వదేశంలో జరుగుతుండటం పాకిస్తాన్ కు ప్లస్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. మరి ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో ఏం చేస్తుందో చూడాలి. 

36
Image Credit: Getty Images

ఫుల్ జోష్ లో ఉన్న న్యూజిలాండ్ 

మరోవైపు న్యూజిలాండ్ జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. ఇటీవల ట్రై సిరీస్ గెలుచుకుని ఫుల్ జోష్ లో ఉంది.  2019 తర్వాత పాకిస్తాన్‌లో అత్యధిక వన్డేలు (11) ఆడిన అనుభవం న్యూజిలాండ్‌కు ఉంది. డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, విలియమ్సన్, డారిల్ మిచెల్, లేథమ్ లతో కీవీస్ బలమైన బ్యాటింగ్ లైనప్ ను కలిగి ఉంది.

ఆల్‌రౌండర్లు మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ జట్టుకు మరింత బలం చేకూరుస్తారు. అయితే ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అనుభవజ్ఞుల కొరత కనిపిస్తోంది. సౌథీ, ఫెర్గూసన్ లేని జట్టులో మ్యాట్ హెన్రీ, జేమిసన్, విల్ ఒరౌర్కె బౌలింగ్‌ విభాగాన్ని  నడిపిస్తారు.

46
Image Credit: Getty Images

పాకిస్తాన్ vs న్యూజిలాండ్: ప్లేయింగ్ 11 లో ఎవరెవరుంటారు? 

పాకిస్తాన్: ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్, తయ్యబ్ తాహిర్, ఖుష్‌దిల్, షాహీన్, హారిస్, నసీమ్ షా, అబ్రార్.

న్యూజిలాండ్: యంగ్,  డేవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, విలియమ్సన్, డారిల్, లేథమ్, ఫిలిప్స్, సాంట్నర్ (కెప్టెన్), హెన్రీ, జేమిసన్, నాథన్ స్మిత్.

 

56

ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయి? 

ఆడిన మొత్తం మ్యాచ్‌లు: 118

పాకిస్తాన్ గెలిచిన మ్యాచ్‌లు: 61

న్యూజిలాండ్ గెలిచిన మ్యాచ్‌లు: 53

ఫలితం తేలని మ్యాచ్‌లు: 03

టై అయిన మ్యాచ్‌లు : 01

కరాచీ స్టేడియం పిచ్ రిపోర్ట్, మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

కరాచీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ ఆరంభంలో బౌలింగ్ కు అనుకూలిస్తుంది. అయితే, భారీ స్కోర్లు నమోదు కావొచ్చు. మంచు కారణంగా టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. 

మ్యాచ్ సమయం: మధ్యాహ్నం 2.30 (భారత కాలమానం)

లైవ్ స్ట్రీమింగ్ : స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు.

66
champions trophy 2025, karachi,

3 దశాబ్దాల తర్వాత పాక్‌లో ఐసీసీ టోర్నీ

3 దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ ఐసీసీ టోర్నీని నిర్వహిస్తోంది. పాక్‌లో చివరిసారిగా ఐసీసీ టోర్నీ జరిగింది 1996లో. భారత్, శ్రీలంకలతో కలిసి పాకిస్తాన్ వన్డే ప్రపంచకప్‌ను నిర్వహించింది.

స్డేడియం వద్ద 12,000 మందితో భద్రత

ఐసీసీ టోర్నీని నిర్వహిస్తున్న పాకిస్తాన్, భద్రత కోసం 12,000 మందికి పైగా సిబ్బందిని మోహరించింది. లాహోర్ స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 12 మంది ఉన్నతాధికారులు, 6,700 మంది కానిస్టేబుళ్లు సహా 8,000 మందికి పైగా సిబ్బందిని మోహరించారు. కరాచీ, రావల్పిండి స్టేడియంలు, ఆటగాళ్లు బస చేసే హోటళ్లు, వారు ప్రయాణించే మార్గాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories