ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విల్ యంగ్, టామ్ లాథమ్ లతో పాటు అంతకుముందు ముగ్గురు న్యూజిలాండ్ ప్లేయర్లు ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు సాధించారు. వారిలో ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన తొలి న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ నాథన్ ఆస్లే. 2004 టోర్నమెంట్ ఎడిషన్‌లో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్టల్ 151 బంతుల్లో 145 (13 ఫోర్లు, ఆరు సిక్సర్లు) పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆస్లే సూపర్ ఇన్నింగ్స్ తో న్యూజిలాండ్ 347/4 స్కోరు చేసింది. 210 పరుగుల తేడాతో గెలిచింది.
క్రిస్ కైర్న్స్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ కొట్టిన న్యూజిలాండ్ ప్లేయర్. 2000లో భారత్‌తో జరిగిన ఫైనల్‌లో క్రిస్ కైర్న్స్ తనదైన శైలిలో సెంచరీ సాధించి, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ సాధించిన రెండవ కివీస్ బ్యాట్స్‌మన్ అయ్యాడు. కైర్న్స్ 113 బంతుల్లో అజేయంగా 102 పరుగులు (ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) చేయడంతో NZ 49.4 ఓవర్లలో 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అలాగే, కీవీస్ మొట్టమొదటి, ఏకైక ICC ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ కొట్టిన న్యూజిలాండ్ ప్లేయర్లలో కేన్ విలియ్సమన్ కూడా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ 97 బంతుల్లో 100 పరుగులు (ఎనిమిది బౌండరీలు, మూడు సిక్సర్లు) సాధించాడు. ఆస్ట్రేలియా తమ లక్ష్యఛేదనలో ప్రారంభంలోనే ఇబ్బంది పడింది, మూడు వికెట్లు త్వరగా కోల్పోయింది, కానీ వర్షం కారణంగా రెండు జట్లు పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది.